Breaking News

కార్పొరేషన్ మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం లాగా ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాడ్ కంట్రోల్ రూమ్ లోని మరియు విజయవాడ నగరపాలక పరిధిలో ఉన్న మూడు జోనల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజలకు కార్పొరేషన్ సంబంధించిన ఎటువంటి సమస్య అయినా సరే జోనల్ కార్యాలయాల్లో కానీ విజయవాడ నగరపాలక సంస్థ ప్రథమ కార్యాలయంలో కానీ తమ ఫిర్యాదులను ఉదయం 10:00 గంటల నుండి విన్నతుల రూపంలో తెలుపవచ్చని, ప్రతి సమస్యని శాఖధిపతుల సమక్షంలో స్వీకరించి, ఆ సమస్యను సత్వరమే పరిష్కరిస్తామని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *