విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఐదు దశాబ్దాలుగా ప్రజాజీవనంలో అలుపెరగని పయనం సాగిస్తూ 50 వసంతాలను (పంచసప్తతి) పూర్తి చేసుకున్న శుభసందర్భంగా భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పంచసప్తతి వేడుకల్లో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకూ పల్లె నుంచి పద్మవిభూషణ్ వరకూ మన ఆత్మీయులు వెంకయ్యనాయుడు జీవన ప్రయాణం, ఆయన సాధించిన విజయాలను, జాతికి ఆయన చేసిన సేవలను స్మరిస్తూ నిర్వహించిన పంచసప్తతి ఆత్మీయ సంగమం విజయవాడలోని మురళి రిసార్ట్స్ లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు, వెంకయ్య నాయుడు ని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …