-బిజెపి విప్, జమ్మలమడుగు బిజెపి ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ.. సమస్యల పరిష్కారం కోసం బిజెపి రాష్ట్ర శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వారధి కార్యక్రమానికి వస్తున్న సమస్యలు పరిష్కారం వెనువెంటనే జరుగుతోంది. వారధి రెండవ రోజు కార్యక్రమంలో సమస్యల పరిష్కారానికి బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నిర్వహించారు. ఈ సందబర్భంగా తనను కలసిన మీడియా తొ మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర కార్యాలయం ద్వారా సమస్యలు పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు నడుంబిగాంచామన్నారు. విజయవాడ అవినాష్, రాయలసీమ అవినాష్ రెడ్డి తప్పులు చేశారాని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అల్లూరి మన్యం జిల్లా చింతూరు కు చెందిన గిరిజనలు తమ సమస్యలను ఆదినారాయణ రెడ్డి ముందు ఏకరవు పెట్టారు. చింతపల్లి కి చెందిన పెనుమాక రవికుమార్, బండ్ల చిరంజీవి లు సమస్యలు వివరిస్తూ ఆశ్రమ పాఠశాలలకు మరగు దొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు విద్యార్ధులు అదేవిధంగా ఉపాధ్యాయుల నియమించాలని కోరారు. అదేవిధంగా గిరిజన గ్రామాల్లో రోడ్లు లేక పోవడంతో గర్భిణీలు ప్రాణాలు కోల్పోతున్నారు విశాఖ పట్నం ఆసుపత్రులకు తరలించాలంటే అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని అక్కడ కు తీసుకు వెళ్లే సమయాని కి ప్రాణాలు పోతున్నాయని వివరించారు వెంటనే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమంత్రి సత్యకుమార్ యాదవ్ తో మాట్లాడి సమస్య త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తామని అక్కడికక్కడే రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రితో వారికి ఫోన్ లో మాట్లాడించి వారికి ధైర్యం చెప్పారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.
అదేవిధంగా క్రుష్ణా జిల్లా పెనమలూరు కు చెందిన షేక్ మస్తాన్ మోకాలు చిప్ప ఆపరేషన్ కోసం విన్నవించాడు. మోకాలు చిప్ప ఆపరేషన్ ఆరోగ్యశ్రీలో లేదని గత ప్రభుత్వంలో ఎవరూపట్టించుకోలేదని వాపోయాడు వెంటనే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చలించి పోయారు. వెంటనే బెంగుళూరులోని వైదేహీ ఆసుపత్రి వైద్యులతో ఫోన్ లో మాట్లాడి వారికి అవసరమైన సహకారం అందించడంతో ఆదినారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపాడు. ఈ విధంగా 15 అర్జీలను వెంటనే అక్కడికక్కడే పరిష్కరించారు.
వారధి కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, బిజెపి అధికార ప్రతినిధులు పూడి తిరుపతి రావు, పెద్దిరెడ్డి రవికిరణ్, వారధి కో ఆర్డినేటర్ కిలారు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.