అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం గురించి మాట్లాడే కనీసం అర్హత కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టును వెలుగొండ ప్రాజెక్టును అనార్థరైజ్డ్ ప్రాజెక్టు గా చూపించే ప్రయత్నం జగన్ మోహన్ రెడ్డి చేశారని అన్నారు. అయితే నాడు చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలు అంతా దిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి ఆథరైజ్డ్ ప్రాజెక్టుగా గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించామని గుర్తు చేశారు. అధికారంలో ఉండి జగన్ రెడ్డి చేయాల్సిన పనిని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండి చేసింది. దీనికి జగన్ మోహన్ రెడ్డి నిజంగా సిగ్గుపడాలని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డికి స్వప్రయోజనాలు తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలను అవసరం లేదని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి కుమ్మకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను జగన్ మోహన్ రెడ్డి తాకట్టుపెట్టారని విమర్శించారు.
ఇసుక దోపిడీ మీద ఉన్న శ్రద్ధ ప్రాజెక్టుల నిర్వహణ మీద లేదు..
జగన్ మోహన్ రెడ్డికి ఇసుక దోపిడీ మీద ఉన్న శ్రద్ధ ప్రాజెక్టుల నిర్వహణ మీద లేదని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోతే అమర్చలేని అసమర్థుడు జగన్… అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే రాష్ట్రంలోని ప్రతీ ఒక్క సాగు నీటి ప్రాజెక్ట్ ను నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు. సాగు నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అని అంటారు అలాంటి వాటని జగన్ రెడ్డి తన హయాంలో గాలికి వదిలేశాడని చెప్పారు. ఈ కారణం గానే ఏకంగా అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి అనే ఆలోచనలు జగన్ మోహన్ రెడ్డికి ఎలాగూ రావు. ఇలాంటి సమయంలో కనీసం కొద్ది రోజుల పాటు ఏం మాట్లాడకుండా ఉంటే జగన్ రెడ్డికి చాలా మంచిది అని హితవు పలికారు.