అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కల్పన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కానూరులో “ఫెడరల్ స్కిల్ అకాడమీ” ట్రైనింగ్ సెంటర్ నందు “కెరీర్ సెషన్స్” పై 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి అనంతరం ప్రముఖ కంపెనీలలో ఉద్యోగవకశాలకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు ఒక ప్రకటన లో తెలియజేసారు.అదే విధంగా జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు మాట్లాడుతూ ఉచిత శిక్షణలకు ఇంటర్, డిగ్రీ, బి.టెక్ (పాస్/ఫెయిల్) చేసిన 18 నుండి 29 సంవత్సరాల అభ్యర్థులు అర్హులు అని ఆయన తెలియజేసారు. అతి త్వరలో శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శిక్షణ అనంతరం ప్రముఖ ప్రైవేటు రంగ సంస్థలలో ఉద్యోగావకాశాలు పొందవచ్చని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా కానూరు లోని తులసినగర్ లో గల “ఫెడరల్ స్కిల్ అకాడమీ” ట్రైనింగ్ సెంటర్ కు తమ విద్యార్హత ధ్రువపత్రాలతో పాటు, ఆధార్ కాపీ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో వచ్చి తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.మరిన్ని వివరాలకు 87146 92749, 87146 92748 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
Tags amaravathi
Check Also
ప్రభుత్వ హౌసింగ్ లే అవుట్ మౌలిక సదుపాయాలు కల్పించాలి కలెక్టరు ప్రశాంతి
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ లే అవుట్ లలో మౌలిక సదుపాయాలు కల్పించడం కు తగిన ప్రాధాన్యత …