Breaking News

సెప్టెంబరు 14 న జాతీయ లోక్ అదాలత్

-రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ ఎమ్.బబిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వచ్చే నెల 14 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నున్న అన్ని న్యాయ స్థానముల ఆవరణములలో జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంటర్ సెక్రటరీ (డిస్ట్రిక్టు అండ్ సెషన్స్ జడ్జి) ఎమ్.బబితా తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన పోషకులు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు కార్య నిర్వాహాక అధ్యక్షులు, న్యాయమూర్తి జస్టిస్ జి.నరేందర్ ఇందుకు సంబందించి ఇప్పటికే ఆదేశాలను జారీచేయడం జరిగిందని ఆమె తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం దగ్గర్లోనున్న రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ కోర్టులో పెండింగ్ లో ఉన్న అన్ని రకాల రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద నష్ట పరిహార కేసులు, లేబర్ కేసులు, సివిల్ కేసులు మరియు కోర్టుల ముందుకు రాని రాజీ పడదగిన తగాదాలు ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆమె తెలిపారు. లోక్ అదాలత్ అవార్డులు లేని అంతిమ తీర్పు, లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకొనుట ద్వారా సామరస్య పూర్వకమైన పరిష్కారాన్ని త్వరితగతిన పొందటంతో పాటు పెండింగ్ లో ఉన్న రాజీపడిని కేసులలో చెల్లించిన కోర్టు ఫీజును కూడా వాపసు పొందవచ్చని ఆమె తెలిపారు. ప్రజలు, కక్షిదారులు అందరూ తమ దగ్గరలోని కోర్టు ఆవరణల్లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లను సద్వినియోగంచేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఉచిత న్యాయ సేవలకై జాతీయ టోల్ ఫ్రీ నెంబరు 15100…
న్యాయ సేవాధికార సంస్థ ద్వారా బడుగు, బలహీ వర్గాల వారు ఉచితంగా న్యాయ సేవలు పొందవచ్చని ఆమె తెలిపారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుండి అయినా వారి వారి సమస్యలను జాతీయ టోల్ ఫ్రీ నెంబరు 15100 కు తెలియజేసిన యెడల తగు సలహా మరియు సహాయమును అందించడం జరుగుతుందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా వున్న వివిధ న్యాయసేవాధికార సంస్థల ద్వారా వివిధ న్యాయ సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. మహిళలు, షెడ్యూలు కులములు మరియు తెగలు, పిల్లలు, కార్మికులు మొదలగువారు ఉచిత న్యాయ సహాయానికి అర్హులన్నారు. వీరితో పాటు సంవత్సర ఆదాయం మూడు లక్షలకు మించనివారు కూడా అర్హులని ఆమె తెలిపారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన వసతి గృహాలలో నివసిస్తున జువెనైల్స్, విభిన్న ప్రతిభావంతులు, వృద్దులు, అనాధల సమస్యలతో పాటు వసతి గృహాల నిర్వహణలో ఏమైనా లోపాలు ఉంటే వాటి నివారణకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. జైళ్లలో ఉన్న వారికి వృత్తి నైపుణ్య కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది, దాదాపు 93 మంది ఖైదీలకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. అదే విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో లీగల్ ఎయిడ్ డిఫెన్సు కౌన్సిల్స్ ఉన్నాయని, ప్రైవేటు కేసులకు సంబందించి కూడా ఈ కౌన్సిల్స్ ఉచితంగా న్యాయసేవలు అందజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ సేవలను కూడా

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఉప కార్యదర్శి డాక్టర్ హెచ్.అమర రంగేశ్వర రావు, సహాయ కార్యదర్శి యన్.జేజేశ్వర రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Check Also

ప్రభుత్వ హౌసింగ్ లే అవుట్ మౌలిక సదుపాయాలు కల్పించాలి  కలెక్టరు ప్రశాంతి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ లే అవుట్ లలో మౌలిక సదుపాయాలు కల్పించడం కు తగిన ప్రాధాన్యత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *