అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు, రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సన్మానించారు. వెలగపూడి సచివాలయంలో కన్నయ్యనాయుడుకి శాలువా కప్పి జ్ఞాపిక అందించి అభినందించారు. వరద పోటుతో ఇటీవల తుంగభద్ర జలాశయ 19వ గేటు కొట్టుకపోయింది. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు సమస్యను పరిష్కరించేందుకు కన్నయ్య నాయుడికి ఫోన్ చేసి అక్కడకు వెళ్లాలని కోరారు. పరిస్థితిని గాడిన పెట్టేందుకు ఎంతో శ్రమించిన కన్నయ్య నాయుడు వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలోనే ఏపీ, కర్నాటక అధికారుల సహకారంతో స్టాప్ లాగ్ గేటు విజయవంతంగా అమర్చారు. దీంతో సుమారు 30 టీఎంసీల నీరు వృధా కాకుండా అడ్డుకోగలిగారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం కన్నయ్య నాయుడిని ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. ప్రాజెక్టులో నీరు ఉండగానే స్టాప్ లాక్ గేటు అమర్చి నీరు వృధా కాకుండా రైతాంగానికి ఎంతో మేలు చేశారని ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర రైతాంగం తరపున కన్నయ్య నాయుడుకి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …