Breaking News

వరద నీటిలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేయడం రికార్డు

-ఫలితంగా తుంగభద్ర రిజర్వాయరులో 40 టి.ఎం.సి.ల వరద నీటిని కాపాడుకోగలిగాం
-రాష్ట్ర రైతాంగం ప్రత్యేకించి రాయలసీమ రైతాంగం తరపున కన్నయ్య నాయుడికి కృతజ్ఞతలు
-రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుండగా తుంగభద్ర 19 వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేయడం అనేది భారత దేశ చరిత్రలోనే ఒక అపూర్వమైన ఘట్టమని, అటు వంటి రికార్డును సృష్టించిన ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు కన్నయ్య నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేయడం వల్ల సుమారు 40 టి.ఎం.సి.ల నీరు వృదా కాకుండా కాపాడుకోవడం జరిగిందన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్ లో సర్వేపల్లి నియోజక వర్గం శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు, రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుతో కలసి మంత్రి పాత్రికేయులతో మాట్లడుతూ తుంగభద్ర రిజర్వాయరు 19 వ గేటు తీవ్రమైన వరదనీటికి కొట్టుకు పోవడంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రైతాంగం తీవ్ర ఆందోళనకు గురయ్యారన్నారు. అటు వంటి క్లిష్టపరిస్థితులో సంక్షోభాలను అధిగమించడంలో మంచి అనుభవం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు సాగునీటి రంగంలో దాదాపు 50 సంవత్సరాల అనుభవం ఉన్న శ్రీ కన్నయ్య నాయుడు సహాకారంతో స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఫలితంగా నేడు సుమారు 77 టి.ఎం.సి.ల నీరు ఆ రిజర్వాయరులో నిల్వ ఉండటం వల్ల రాయలసీమ ప్రాంతంలోని ఎల్.ఎల్.సి., హెచ్.ఎల్.సి., కె.సి. కెనాల్ కు సమృద్దిగా త్రాగునీరు, సాగు నీరు అందించగలిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. తుంగభద్ర గేటు కొట్టుకుపోయిందని తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అర్థరాత్రి సైతం నాతో, అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి పయ్యావుల కేశవ్ మరియు జలవనరుల శాఖ కార్యదర్శితో కాన్పరెన్సు నిర్వహించి అప్రమత్తం చేయడం వల్లే ఈ సంక్షోభం నుండి గట్టెక్కగలిగామన్నారు. లేకుంటే తుంగభద్ర జలాశయం ద్వారా త్రాగు, సాగు నీరు పొందే అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలతో పాటు తెలంగాణాకు చెందిన ప్రజలు, రైతులు ఎన్నోసమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడేదన్నారు. రాష్ట్ర రైతాంగం ప్రత్యేకించి రాయలసీమ రైతాంగం తరపున కన్నయ్య నాయుడికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు కన్నయ్య నాయుడు మాట్లాడుతూ గత 52 ఏళ్లుగా సాగునీటి రంగంలో పనిచేస్తూ దక్షణాది రాష్ట్రాల్లో ఇలాంటి గేట్లు ఎన్నో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తుంగభద్ర డ్యామ్ ను 1954 లో కమిషనింగ్ చేయడం జరిగిందని, దాని కాలపరిమితి 45 ఏళ్లుకాగా, ఇప్పటి వరకూ దాదాపు 70 ఏళ్ల పాటు పనిచేయడం జరిగిందన్నారు. 1970 లోపు ఏర్పాటు చేయబడిన తుంగభద్ర, ప్రకాశం, నాగార్జున సాగర్ డ్యామ్లకు స్టాప్ లాగ్స్ లేవన్నారు. 2002 లో ప్రకాశం బ్యారేజ్ గేట్లు మార్చడం జరిగిందన్నారు. తీవ్రమైన వరదనీటిలో రిస్కుతీసుకుని తుంగభద్ర రిజర్వాయరు గేటు మార్చడం అనే పనిని చాలెంజ్ గా నిర్వహించడం జరిగిందన్నారు. 50 మంది సాయంతో ఐదు రోజుల్లో గేటు డిజైన్ చేసి ఏర్పాటు చేయడం అనేది ఒక రికార్డు అన్నారు. ఇప్పడు 26 లక్షల ఎకరాలకు నీరు లభించినట్లు అయ్యిందన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *