-పూత, గూడ ((మొగ్గ)వచ్చే 45 రోజుల పంట వయసు నుండి నిరంతర పర్యవేక్షణ అవసరం
-రసాయనిక మందులకన్నా యాజమాన్య పద్ధతుల ద్వారా ఉత్తమ ఫలితాలు
-గుడ్డు దశను ముందుగానే గుర్తించాలి
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక మంగళగిరి వ్యవసాయ కార్యాలయం నుండి గురువారం రాష్ట్రము లోని జిల్లా వ్యవసాయ అధికారులతో పత్తి పంటలో గులాబిరంగు పురుగు,మొక్క జొన్నపంట లో కత్తెరపురుగువాటి యాజమాన్య పద్ధతులపై ఆచార్య ఎన్ జీ రంగా విశ్వవిద్యాలయం ప్రధాన కీటక శాస్త్రవేత్త డా. జి.ఎం.వి.ప్రసాద రావు మరియు వ్యవసాయ సంచాలకులు ఎస్.డిల్లీరావు IASవారు హైబ్రిడ్ పద్ధతి లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా పునశ్చరణ కార్యక్రమం జరిపారు.ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఎస్.డిల్లిరావు IAS వారు మాట్లాడుతూ, పత్తిపంట లోదిగుబడులను పెంచిన బి టి సాంకేతిక పరిజ్ఞానం తర్వాత ఇప్పటివరకు గులాబిరంగు పురుగును అదుపు చేయటానికి ఎటువంటి కొత్త ఆవిష్కరణలు జరగలేదని తెలిపారు.గులాబిరంగు పురుగునుఅదుపుచేసే సాంకేతిక పరిజ్ఞానo అభివృద్ధి చేసేలోపు పత్తిపంటను రక్షించడానికి ఏమి చేయాలన్నది శాస్త్రవేత్తలతో మేధోమధనం జరగడానికి ఈ కార్యక్రమం జిల్లా అధికారులకు చక్కని వేదిక గా నిలుస్తుందని తెలియచేసారు.
శాస్త్రవేత్త డా. జి.ఎం.వి .ప్రసాద రావుగారు మాట్లాడుతూ పంట 45 రోజుల వయసు లో ఏర్పడే గూడ (మొగ్గ) మరియు పూతదశలోని పూ రెక్కల లోపలి భాగమున గుడ్లను పెడతాయని, ఆ గుడ్లు కేవలం 4 గంటలలో పొదగబడి మొదటి దశ లార్వా లేత కాయలలోకి చొచ్చుకుని పోయి కాయ లోపలి భాగాలను తింటూ, తనని తానూ రక్షించుకుoటుoదని తెలియచేసారు. ఆ గుడ్డు ఉనికిని గుర్తించడమే ఈ పురుగు నివారణకు అత్యంత కీలకమైన దశ అని,దానిని గుర్తించాల్సిన అవసరం ఉందని తెలియచేసారు. అందుచేతగుడ్డు యొక్క పరివర్తనను ప్రతి ఒక్క రైతు అర్థం చేసుకోవాలని తెలిపారు.
శ్రీ డిల్లీరావు IAS వారు మాట్లాడుతూ జిన్నింగ్ మిల్లులలో కోశస్థ దశలో ఉన్న ఈ పురుగు నిద్రావస్థలో ఉండి రెక్కల పురుగులుగా మారకుండా వాటిని నిర్మూలించాలని తెలిపారు. పంటను కొనసాగించకుండా మూడు పత్తి తీతలు అయిన తర్వాత నిర్మూలించాలని తెలిపారు. చేను పై ఎటువంటి పంట అవశేషాలు లేకుండా చూసుకోవాలన్నారు.ఎకరానికి 20 లింగాకర్షక బుట్టలను అమర్చటం ద్వారా పిబిరోప్ -L, నాట్మేట్ (Natmate) జెల్ పరిజ్ఞానం లను ఉపయోగించి రెక్కల పురుగులలో సంపర్కం జరగకుండా ఆపడం ద్వారా గులాబి పురుగు వ్యాప్తి ని అరికట్టవచ్చు.
విత్తిన 40 నుండి 45 రోజుల వయసు నుండి ఈ యాజమాన్య పద్ధతులను అనుసరించినప్పుడు మాత్రమే ఫలితాలు ఉంటాయని తెలిపారు.గుడ్లను పొడగనీయకుండా చేసే వేపగింజల కషాయం లేదా ప్రోఫినోఫోస్ లను వాడుతూ గులాబీ పురుగు మొదటి తరం లోనే అదుపు చేసి తరువాత దశలకు అభివృద్ధి చెందకుండా చేయటం అత్యంత అవసరమని తెలిపారు
ఈ శిక్షణ కొనసాగింపుగా గత కొన్ని సంవత్సరంలనుండి మొక్కజొన్న పంటను ఆశించి ఎక్కువగా నష్టపరుస్తున్న కత్తెర పురుగు నివారణ మరియు యాజమాన్య పద్ద్హతులను వివరించారు. వాటిలో విత్తే సమయాన్ని మార్చటం,విత్తిన 26 రోజుల తర్వాత వేపగింజల కషాయాన్ని ఆకు సుడుల వద్ద ద్రావణాన్ని పోయడం, పైరు 45 రోజులలో ఉన్నప్పుడు విషపు ఎరలను పెట్టటం, గుడ్లు మరియు సన్నపురుగుల సముదాయాలను తొలగించటం, జీవసంబందిత శిలీంద్ర నాశని బవేరియా, మెటారైజియం లను ఉపయోగించి నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం లో చివరగా జిల్లా వ్యవసాయ అధికారుల సందేహాలను నివృత్తి చేసారు.