-నగర ఉప పోలీస్ కమీషనర్ (ట్రాఫిక్) చక్రవర్తి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రహదారి భద్రత విషయంలో విద్యార్ధులు అప్రమత్తంగా వ్యవహరించాలని నగర ట్రాఫిక్ డిసిపి కె. చక్రవర్తి అన్నారు. నిబంధనలను పాటిస్తూ ప్రయాణం చేస్తే ప్రమాదరహితంగా ఇంటికి చేరుకుంటామన్నారు. నిర్మలా హైస్కూల్ లో శనివారం నిర్వహించిన ట్రాఫిక్ అవగాహనా కార్యక్రమంలో ఆయన విధ్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత పరిస్దితులలో చిన్నారులే తమ తల్లిదండ్రులకు ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి చెబుతుండటం వారి అవగాహనకు నిదర్శనమని డిసిపి చక్రవర్తి అన్నారు. చిన్న పొరపాటు అయా కుటుంబాలకు జీవితకాలపు శిక్షగా మిగిలిపోతుందన్నారు. ప్రత్యేకించి విద్యార్ధులు, యువత పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని పోలీసు యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ జిబి అంటోని, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ మ్యాగి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News