Breaking News

ఈ పంట నమోదుకు చివరి తేదీ సెప్టెంబర్ 15

-గ్రామస్థాయి రెవిన్యూ వ్యవసాయ అధికారులు పెండింగ్ ప్రమాణీకరణ పూర్తి చేయాలి
-రైతుల ఖాతాలకు చెందిన ఖాతాల ప్రమాణీకరణ సమాంతరంగా చేపట్టాలి
-టెలి కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సాగు విస్తీర్ణం ఈ క్రాప్ నమోదు, జాయింట్ ల్యాండ్ ప్రోపర్టీ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని, ఇందుకు డివిజన్, మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయిలో పర్యవేక్షణ బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ విడిది కార్యాలయం నుంచి ఖరీఫ్ సీజన్ ఈ క్రాప్ నమోదు, జాయింట్ ఎల్ పి ఎం పై జిల్లా ,డివిజన్ , మండల గ్రామ స్థాయి అధికారులతో కలెక్టరు పి ప్రశాంతి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో ఈ పంట నమోదు 60% పూర్తయిందన్నారు. ఈ క్రాప్ నమోదుకు సెప్టెంబర్ 15 వరకు మాత్రమే సమయం ఉందని ఈ లోగా పంట వివరాలు నమోదు పూర్తి చేయాలన్నారు. ఈ పంట నమోదు పూర్తి చేయడంలో గ్రామ రెవెన్యూ అధికారులు , గ్రామ వ్యవసాయ అధికారులు వాటిని నిర్ధారణ (ప్రమాణీకరణ)చేయాల్సి ఉందన్నారు ఇప్పటివరకు 60.24 % నిర్ధారణ చేసినట్లు పేర్కొన్నారు. ఈ పంట నమోదు లో 60 శాతం కంటే తక్కువ చేసిన సీతానగరం , రాజానగరం, దేవరపల్లి, కోరుకొండ, నల్లజర్ల , కడియం మండలాలు ఉన్నాయని, సెప్టెంబర్ 15వ తేదీ కటాఫ్ తేదిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిపారు.. పంట నష్టం, సబ్సిడీ తదితర ప్రభుత్వ ప్రోత్సాహకాలు రైతులు పొందేందుకు ఈ క్రాప్ నమోదు తప్పనిసరి అన్న విషయాన్నీ ఇప్పటికే పలుమార్లు చెప్పడం జరిగిందన్నారు. విఆర్వో, విఆర్ఏ లతో పాటుగా రైతుల ద్వారా ప్రమాణీకరణ పూర్తి చెయ్యాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు కేవలం 7.8 శాతం మంది రైతులు ఆమేరకు ధ్రువీకరణ చేశారని మిగిలిన వారితో కూడా సమాంతరంగా లక్ష్యాలు సాధించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. డివిజన్, మండల స్థాయి అధికారులు వ్యక్తిగత పర్యవేక్షణ తప్పనిసరి అని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు.

జాయింట్ ల్యాండ్ ప్రోపర్టి మ్యాపింగ్:
తూర్పు గోదావరి జిల్లాలో జాయింట్ ల్యాండ్ ప్రోపర్టి మ్యాపింగ్ కి సంబంధించి 271 గ్రామాలకు గాను 183* గ్రామాల్లో 11, 469 హెక్టార్ల విస్తీర్ణంలో 31,395 ల్యాండ్ రికార్డులు నవీకరించాల్సి ఉండగా 6643 (21%) పూర్తి చేశారన్నారు. నల్లజర్ల, రాజానగరం, ఉండ్రాజవరం, చాగల్లు 10శాతం లోపు ఉండగా, దేవరపల్లి, సీతానగరం, నిడదవోలు, గోకవరం మండలాలు అత్యధిక గణన పూర్తి చేశారన్నారు. రికార్డులు పరంగా రాజానగరం : 5115 , కోరుకొండ. : 7049, బిక్కవోలు. : 4191 భూ వివరాలను నవీకరించాల్సి ఉందని పేర్కొన్నారు.

జిల్లా, డివిజన్ మండల స్థాయి అధికారులు గ్రామాల వారిగా ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆమేరకు లక్ష్యాలను సెప్టెంబరు మొదటి వారంలోగా పూర్తి చెయ్యాల్సి ఉంటుందని ఆదేశించారు.

ఈ టెలి కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, ఆర్డీవోలు కేఎల్ శివ జ్యోతి, ఆర్ కృష్ణ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, హార్టికల్చర్ అధికారి బి సుజాత, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *