నూజివీడు/ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు పెద్దచెరువుకు వచ్చిన వరద కారణంగా నీట మునిగిన నూజివీడు లోని పలు ప్రాంతాలను మంత్రి కొలుసు పార్థసారథి అధికారులతో కలిసి ఆదివారం ఎన్, టి, ఆర్, కాలనీ, గాంధీనగర్ నగర పురవీధుల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ పెద్దచెరువుకు గండి పడిన కారణంగా నూజివీడు పట్టణంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయని, వెలమపేట లో నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను నూజివీడు పట్టణంలోని అదేవిధంగా నూజివీడు నియోజకవర్గంలోని మొగలు చెరువు, నూజివీడు ఊరచెరువు, పోతురెడ్డిపల్లి పెద్దచెరువులకు పలు చోట్ల గండ్లు పడి పలు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, భారీ వర్షాల కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రజలకు భోజన, వసతి సదుపాయాలు కల్పించాలన్నారు. అత్యవసర పరిస్థితి ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సిద్ధం చేయడం జరిగిందని మంత్రి చెప్పారు. వర్షం నీరు నిల్వ ఉన్న కారణంగా త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించాలని మంత్రి మునిసిపల్ కమీషనర్ ను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాలలో వైద్య కేంద్రాలు ఏర్పాటుచేయాలని, వ్యాధులు ప్రబలకుండా చర్యలు వర్షం నీరు వెంటనే తొలిగించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన మంత్రి దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్, మలాథియాన్ స్ప్రే చేయాలనీ మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట మునిసిపల్ కమీషనర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్,స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Tags Eluru
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …