గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితుల కోసం విరాళాలు అందించాలి అనుకునే దాతలు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గుంటూరు డిస్ట్రిక్ట్ పేరుతో IDFC బ్యాంక్ అకౌంట్ నం.33260919895, ఐఎఫ్ఎస్సీ కోడ్ IDFC0081061 పేరుతో చెక్ లు, డిడిలు అందించ వచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవడానికి విరాళాలు అందించడానికి పలువురు ముందుకు వస్తున్నారని, విరాళాలు అందించే వారి కోసం ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. విరాళాలు అందించాలి అనుకునే దాతలు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గుంటూరు డిస్ట్రిక్ట్ పేరుతో IDFC బ్యాంక్ అకౌంట్ నం.33260919895, ఐఎఫ్ఎస్సీ కోడ్ IDFC0081061 పేరుతో చెక్ లు, డిడిలు అందించవచ్చని తెలిపారు. అలాగే గుంటూరు నగరపాలక సంస్థ కూడా విరాళాలు, వస్తువుల సేకరణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసిందన్నారు.
Tags guntur
Check Also
పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …
Prajavartha Online Telugu News