“మినీ జాబ్ మేళా”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనైపుణ్యాభివృద్ది సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ అధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించుటకు గాను చేపడుతున్న “మినీ జాబ్ మేళా” లో భాగంగా, గురువారం NAC బొమ్మూరు , రాజమండ్రీ “మినీ జాబ్ మేళ” నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నైపణ్యాదికారి ఎమ్ కొండలరావు మరియు జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ జాబ్ మేళా లో 3 కంపెనీలు పాల్గొన్నాయని 86 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా 23 మంది వివిధ కంపెనీలలో ఎంపిక అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమం ఎన్ ఎ సి సహాయ సంచాలకులు రాజు పెరుమాళ్, స్కిల్ డెవలప్మెంట్- జిల్లా ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రియ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన అధ్యయనానికి జనసేన కమిటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) జరిగే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *