Breaking News

4 వ రోజు తూర్పు గోదావరి జిల్లా నుంచి విజయవాడ వరద బాధితులకు సహాయం

-55 వాహనాల ద్వారా బియ్యం, ఆహార పదార్థాలు, పాలు, బిస్కెట్స్ రుస్క్ లు, తాగునీరు అందించడం జరిగింది
-విరివిగా సహాయం అందించేందుకు ముందుకు వస్తున్న దాతలు
-సెప్టెంబరు 6 వ తేదీకి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం
-కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా నుంచి 4500 క్వింటాళ్ల బియ్యం ను 18 వేల బస్తాల ద్వారా విజయవాడ వరద బాధితులకు సహాయార్థం పంపించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.  ఉదయం అల్పాహార విందు కింద వరద బాధితుల సహాయార్థం 27500 ఫుడ్ ప్యాకెట్లు, 20 వేల టెట్రా ఒక లీటరు పాల ప్యాకెట్లు, 11500 రస్క్ (rusk) ప్యాకెట్లు, 50 వేల వాటర్ ప్యాకెట్లను 14 వాహనాల ద్వారా పంపడం జరిగిందన్నారు.

మధ్యాహ్నం భోజనాల నిమిత్తం 8 వాహనాల ద్వారా 23 వేల ఫుడ్ ప్యాకెట్లు పంపామని తెలిపారు. రాత్రి భోజనాల నిమిత్తము జిల్లా నుంచి 10 వాహనాలు ద్వారా 34,500 ఫుడ్ ప్యాకెట్లను, 17 వేల వాటర్ బాటిల్ వాటర్ బాటిల్స్ పంపించడం జరిగిందన్నారు. వీటితో పాటుగా 35 వేల బిస్కెట్ ప్యాకెట్లు, 20 వేల క్యాండిల్స్, 20 వేల అగ్గిపెట్టె లని పంపించినట్లు తెలియ చేశారు. జిల్లా స్థాయిలో వివిధ శాఖల అధికారులు స్థానికంగా దాతలతో , పారిశ్రామిక వేత్తలతో, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులతో మాట్లాడడం ద్వారా విపత్తు సమయంలో ముందుకు రావడం పెద్ద ఎత్తున ఆహారాన్ని సేకరించి పంపించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుమేరకు తూర్పు గోదావరి జిల్లా నుంచి 4,500 క్వింటాళ్ల బియ్యాన్ని వరద బాధితుల సహాయార్థం పంపించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ఇందు కోసం 18 వేల బియ్యం బస్తాలనీ ఒక్కొక్కటి 25 కేజీలు కలవి 23 వాహనాల ద్వారా విజయవాడ పంపించడం జరిగిందన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *