గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ లో వరద ప్రభావిత ప్రాంతాలను పూర్వస్థితికి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని గుంటూరు నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణల ఆదేశాల మేరకు విజయవాడలోని 62 వ డివిజన్ పైపుల రోడ్ లో చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ వరద ముంపుకు గురైన విజయవాడను పూర్వస్థితికి తెచ్చేందుకు ప్రత్యేక కార్మిక బృందాలతో కృషి చేస్తున్నామన్నారు. డివిజన్ పరిధిలో కేటాయించిన అన్ని ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధంగా పారిశుధ్య నిర్వహణ చేపట్టి, ప్రజలకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు వహిస్తున్నామన్నారు. ప్రత్యేక పారిశుధ్య పనుల్లో 100 మంది పారిశుధ్య కార్మికులు, 4 మంది కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులతో సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. పారిశుధ్య పనుల్లో భాగంగా వచ్చిన వ్యర్ధాలను ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నామన్నారు. అతి త్వరలో తమకు కేటాయించిన ప్రాంతాన్ని సాదారణ స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
Prajavartha Online Telugu News