తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయక చవితి సందర్భంగా జిల్లాలోని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పర్యావరణ హితంగా ఉత్సవాలు జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ నేడు ఒక ప్రకటనలో వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి ఎంతో పవిత్రమైన పండుగ అని, అన్ని విఘ్నాలను, సంకటాలను హరించి విజయాన్ని అందించే వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలందరి ఇంటా విఘ్నాలు తొలగి వారు ఆయు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో సిరి సంపదలతో తుల తూగాలని సుహృద్భావ వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని, సహజ రంగులతో తయారు చేసిన మట్టి విగ్రహాలను ఉపయోగించాలని, పర్యావరణానికి హాని చేసే కృత్రిమ రంగులతో తయారు చేసిన విగ్రహాలను వాడరాదని, ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడేలా మట్టి వినాయకులని ఉపయోగించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
Tags tirupathi
Check Also
ప్రభుత్వ హౌసింగ్ లే అవుట్ మౌలిక సదుపాయాలు కల్పించాలి కలెక్టరు ప్రశాంతి
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ లే అవుట్ లలో మౌలిక సదుపాయాలు కల్పించడం కు తగిన ప్రాధాన్యత …