Breaking News

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు పరిశీలిన…

-జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో చేపట్టిన పలు పనులను అమృత్ సరోవర్ చెరువు అభివృద్ధి పనులు ఫారం పాండ్లు, హార్టి కల్చర్, ఫ్లోరి కల్చర్ తదితరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన భారత గ్రామీణాభివృద్ధి డిప్యూటీ సెక్రెటరీ అషీస్ గుప్త

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా నందు అమలు జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు, దాని అనుసంధానంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను, అమృత్ సరోవర్ చెరువు అభివృద్ధి పనులు, ఫారం పాండ్లు, హార్టి కల్చర్, ఫ్లోరి కల్చర్ తదితరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి భారత గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ ఆశిష్ గుప్తా సంతృప్తి వ్యక్తం చేసారు.

శుక్రవారం ఉదయం నుండి భారత గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రెటరీ సుడిగాలి పర్యటన చేపట్టి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. వడమాలపేట గ్రామం నందు పంట సంజీవని ఫారం పాండును పరిశీలించారు. అలాగే పర్కులేషన్ పాండులు, సమతల కందకాలు (ట్రెంచెస్) లను, ఎల్.ఎం కండ్రిగ గ్రామం వడమాలపేట మండలం నందు హార్టికల్చర్ ప్లాంటేషన్ కార్యక్రమం కింద కొబ్బరి, జామ, మామిడి తోటలకు సంబంధించి, ఫ్లోరికల్చర్ పూల తోటల కింద గులాబీ తోటలను కదిరి మంగళం వడమాల పేట మండలం నందు పరిశీలించారు. మినీ అమృత్ సరోవర్ ను ఏర్పేడు మండలం కోబాక గ్రామం నందు పరిశీలించారు. అనంతరం అప్పలాయగుంట నందు అమృత సరోవర్ పథకం కింద చెరువుల అభివృద్ధి పనులను, గణేశ్వర పురం రామచంద్రపురం మండలం నందు పట్టుపురుగుల పెంపకానికి సంబంధించి యూనిట్ ను, అలాగే రేణిగుంట మండలం గాజులమండ్యం వద్ద పెద్ద చెదుళ్లలో 400కు పైగా చైన్ పద్ధతిలో లింక్ అయిన పర్క్యులేషన్ పాండ్లను పరిశీలించారు. అంతే కాకుండా ఏర్పేడు మండలం బందార్లపల్లి అమృత సరోవర్ చెరువు అభివృద్ధి పనులను, వడమాలపేట మండలంలోని కల్లూరు అమృత సరోవర్ చెరువు అభివృద్ధి పనులను, ఏర్పేడు మండలం పాగలి ఎమ్ఐ ట్యాంకు ను, సీతారాంపురం రోడ్డును ర్యాండంగా ఆకస్మికంగా సదరు భారత డిప్యూటీ సెక్రటరీ తనిఖీ చేసి జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట రాష్ట్ర సిఆర్డి జాయింట్ కమిషనర్ శివప్రసాద్, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస ప్రసాద్, నరెగ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *