Breaking News

గుజరాత్ లో మంత్రి బీ.సీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ పర్యటన..

-పీపీపీ విధానంలో రోడ్ల అభివృద్ధి & నిర్మాణంపై 2 రోజుల పాటు అధ్యయనం చేయనున్న బృందం
-పీపీపీ విధానం అమలు తీరుతెన్నులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా హైలెవల్ కమిటీకి వివరించిన గుజరాత్ రాష్ట్ర ఉన్నతాధికారులు
-రేపు గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ తో భేటీ కానున్న మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గుజరాత్ పర్యటనకు వెళ్లిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రితో పాటు ఆర్ & బీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ఏపీఆర్డీసీ ఛీప్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి, మరియు ఇతర ఉన్నతాధికారుల బృందానికి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, రోడ్లు మరియు భవనాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘన స్వాగతం పలకడం జరిగింది.
ఈ రోజు ఉదయం గుజరాత్ చేరుకున్న రాష్ట్ర బృందంతో, గుజరాత్ ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆ శాఖ ఛీప్ ఇంజనీర్, ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో గుజరాత్ రాష్ట్రంలో పీపీపీ విధానంలో రోడ్ల అభివృద్ధి, అమలు తీరు గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించడం జరిగింది.
గుజరాత్ రాష్ట్రంలో సుమారుగా 2 లక్షల కి.మీ కు పైగా రహదారులు ఉన్నాయి. వీటిలో పీపీపీ విధానం ద్వారా 14 రహదారులకు సంబంధించి, 1089 కి.మీ రహదారులను అభివృద్ధి చేయడం జరిగింది. దీని ద్వారా సుమారుగా నెలకు రూ. 300 కోట్ల మేర టోల్ ఫీజు ద్వారా ఆదాయం సమకూరడం జరుగుతోందని తెలియజేయడం జరిగింది.
అహ్మదాబాద్ – రాజ్ కోట్ రోడ్డు మార్గాన్ని 2003లో ప్రపంచ బ్యాంక్ నిధుల సహయంతో అభివృద్ధి చేయడం జరిగిందని, ప్రపంచ బ్యాంక్ కు తిరిగి నిధులు చెల్లించు గడువు తేదీ 2020 వరకు ఉన్నప్పటికీ ముందస్తుగానే టోల్ ఫీజు ద్వారా సమకూరిన ఆదాయం ద్వారా 2016 లోనే అప్పులు తిరిగి ప్రపంచ బ్యాంకుకి చెల్లించడం జరిగింది.
పీపీపీ విధానం ద్వారా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గుజరాత్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ. 35 వేల కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపడుతోంది. ముఖ్యంగా వాహనాల రద్దీ అధికంగా ఉన్న రహదారులకు సంబంధించి 2 లైన్ల రహదారులను 4 లైన్ల రహదారులుగా, 4 లైన్ల రహదారులను 6 లైన్ల రహదారులుగా మార్చడానికి మరియు అభివృద్ధి పరచడానికి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం 2007 లో రహదారులు మరియు భవనాల శాఖకు కేటాయించిన బడ్జెట్ రూ. 1100 కోట్లు ఉండగా.. 2023 నాటికి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో రూ. 22 వేల కోట్లు మేర నిధులు కేటాయించడం జరిగిందని, ఇది గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ మొత్తం బడ్జెట్ లో 15 % సమానంగా ఉందని, ఈ తరహాలో రహదారులు మరియు భవనాల శాఖకు కేటాయించే బడ్జెట్ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో కేటాయింపులు లేవని తెలియజేశారు.
వివిధ పథకాల గురించి చర్చించిన తర్వాత, మధ్యాహ్నాం గాంధీ నగర్ సిటీ యొక్క నిర్మాణం గురించి చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి 1970 నుంచి భూసేకరణ చేసిన విధానం మరియు పద్దతులు, భూ కేటాయింపులు… మరియు వివిధ వర్గాలకు భూమి కేటాయింపుకు సంబంధించిన విధానాలను వివరించడం జరిగింది.
అలాగే గిప్ట్ సిటీ నిర్మాణం, హైటెక్ ఎగ్జిబిషన్ నిర్వహణ, మరియు మహత్మ మందిర్ నిర్మాణంలో చేపట్టిన విధానం, దండి కుటీర సందర్శన విధానాలు వివరించడం జరిగింది.
రేపు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలోని హైలెవల్ కమిటీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ గారిని మర్యాదపూర్వకంగా కలవబోతున్నారు.. గుజరాత్ లో స్వయంగా ముఖ్యమంత్రిగారే రహదారులు & భవనాల శాఖ మంత్రిగా కొనసాగడం గమనార్హం.

Check Also

ప్రభుత్వ హౌసింగ్ లే అవుట్ మౌలిక సదుపాయాలు కల్పించాలి  కలెక్టరు ప్రశాంతి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ లే అవుట్ లలో మౌలిక సదుపాయాలు కల్పించడం కు తగిన ప్రాధాన్యత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *