Breaking News

దళితులకు న్యాయం చేయాలి… : వడ్లమూరి కృష్ణ స్వరూప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్ అంబేద్కర్ ని అవమానం చేసిన టీడీపీ ఎమ్మెల్యే, దళిత ప్రొఫిసర్  పైన దాడిచేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ల పైన దాడిచేసిన ఘటన ల పైన కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని దళిత బహుజన పార్టీ డీబీపీ జాతీయ అధ్యక్షులు, సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. నేడు విజయవాడ గాంధీనగర్ లోని ప్రెస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ చట్ట సభ ల రూపశిల్పి .బాబాసాహెబ్ డాక్టర్. అంబేద్కర్ పట్ల ఉదేశ్యం పూర్వకంగా అవమానం చేసిన రఘురామ్ కృష్ణంరాజు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ లను పార్టీ ల మీద ప్రభుత్వం నుండి తగిన చర్యలు సీఎం చంద్రబాబు నాయుడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రకటించారు.
దళితులు ప్రతి ఘటన కు సిద్ధం కావాలని. వీరికి బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు. ఉండి నియోజకవర్గం లోని ఏలూరు పాడు గ్రామం లో దళిత వాడ పైన పోలీస్ లు దాడులు చేయడం అత్యంత దారుణం అన్నారు. రాష్ట్రo లో వంద రోజు ల చంద్రబాబు, పవన్, బీజేపీ, ఎన్డీఏ పాలన లో శాంతి భద్రతలు లేవని దళితులకు రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యే ల పైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసికోకపోతే బాబు, పవన్ ల పైన దళిత జాతి  నిరసన, ఆందోళన, తిరుగుబాటు చేస్తామని కృష్ణ స్వరూప్ ప్రకటించారు. బాధ్యత గల ప్రజా ప్రతినిధులు గా ఉండి రౌడీ లు చెలరేగిపోవడం దారుణం అన్నారు. రాష్ట్రoలో దళితుల పైన దాడిచేసిన వారిపైన ప్రతి దాడులకు సిద్ధం కాకపోతే.. మనకు భవిష్యత్ లేదన్నారు. ఇక ఎంత మాత్రం సహించలేదన్నారు. ఈ మీడియా సమావేశంలో దళిత బహుజన పార్టీ డీబీపీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ ఉప్పాడ రామచంద్రరెడ్డి, పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్. జీకే బాబు, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు రాచూరి. విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు శ‌ర‌వేగంగా ఏర్పాట్లు

– కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి అధికారులు స‌మ‌ష్టిగా కృషిచేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు విజయవాడ, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *