-గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల నగరాన్ని చుట్టుముట్టిన వరదల్లో జగన్మాత అనుగ్రహం వల్లనే అతి తక్కువ ప్రాణ నష్టంతో నగరవాసులు బయటపడ్డారని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు అన్నారు. శరన్నవరాత్రు ఉత్సవాలలో రెండవ రోజైన శుక్రవారం గాయత్రి దేవి అలంకరణతో భక్తులను అనుగ్రహించిన జగన్మాతను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సాంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు అమ్మవారి అనుగ్రహం ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.