Breaking News

ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (APTDC) చైర్మన్ గా డా. నూకసాని బాలాజీ పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమం….

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఆటోనగర్ నందుగల ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (APTDC) ప్రధాన కార్యాలయంలో శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చే ఏపీ టీడీసీ చైర్మన్ గా నియమించబడ్డ డా. నూకసాని బాలాజీ వేద పండితుల ఆశీర్వచనాలతో ఉదయం 10 గంటల 50 నిమిషాలకు పండుగ వాతావరణం మధ్య బాధ్యతలు స్వీకరించారు. విద్యాధికుడు, సౌమ్యుడి గా పేరున్న డాక్టర్ నూకసాని బాలాజీ ప్రకాశం జిల్లా అధికార తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కావడం, జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగి వుండి ఆయనకున్న కలుపుగోలుతనం, స్నేహశీల త వల్ల రాష్ట్రం నలుమూలల నుండి అసంఖ్యాకంగా ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు విచ్చేయడంతో డాక్టర్ నూకసాని బాలాజీ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఆద్యంతం పండుగ వాతావరణం మధ్య అత్యంత కోలాహలంగా జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ తనకు ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  కి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి  దార్శనికత ఎంత గొప్పదో తనకు తెలుసని ఆ బాటలో పయనించి ఏపీటీడీసీని ప్రగతి పథంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. బాధ్యతలు స్వీకరించిన పిదప ఏపీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్  అభిషిక్త్ కిషోర్ ఐఏఎస్ చైర్మన్ కు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనేకమంది ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు వీరిలో ముఖ్యులు…ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు , గొట్టిపాటి రవికుమార్  రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు, అనగాని సత్యప్రసాద్  రాష్ట్ర రెవెన్యూ స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి, కొల్లు రవీంద్ర  రాష్ట్ర ఎక్సైజ్ , గనులు మరియు భూగర్భ శాఖ మంత్రివర్యులు, డాక్టర్  బాల వీరాంజనేయ స్వామి  రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, గద్దె రామ్మోహన్ రావు విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే, యార్లగడ్డ వెంకట్రావు  గన్నవరం నియోజవర్గం ఎమ్మెల్యే, తేనేటి కృష్ణ ప్రసాద్ గా బాపట్ల ఎంపీ,బుర్ల ఆంజనేయులు  ప్రత్తిపాడు ఎమ్మెల్యే, ఎరపతినేని శ్రీనివాసరావు  గురజాల ఎమ్మెల్యే , వేగేసిన నరేంద్ర వర్మ  బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే,దామచర్ల జనార్ధన్  ఒంగోలు ఎమ్మెల్యే, ముత్తుమల అశోక్ రెడ్డి గిద్దలూరు ఎమ్మెల్యే, ఉగ్ర నరసింహారెడ్డి  కనిగిరి ఎమ్మెల్యే, బిఎన్ విజయ్ కుమార్  సంతనూతలపాడు ఎమ్మెల్యే, ఏలూరు సాంబశివరావు  పర్చూర్ ఎమ్మెల్యే, ఇంటూరి నాగేశ్వరావు  కందుకూరు ఎమ్మెల్యే, మద్దులూరు మాలకొండయ్య చీరాల ఎమ్మెల్యే, పర్చూర్ అశోక్ బాబు  ఎమ్మెల్సీ, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి  ఎమ్మెల్సీ, దువ్వాడ రామారావు  ఎమ్మెల్సీ,బీద రవిచంద్ర  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంతిని రామరాజు  మాజీ ఎమ్మెల్సీ, జంగా కృష్ణమూర్తి , గొట్టిపాటి లక్ష్మీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్, గూడూరు ఎలక్షన్ బాబు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు , గోరంట్ల రవికుమార్ , రాష్ట్ర యాదవ సంఘం సాధికార సమితి అధ్యక్షులు నాగేశ్వరరావు , రాష్ట్ర బీసీ సంక్షేమ అధ్యక్షులు కేశవరావు, మద్దెల గురుమూర్తిగారు రాష్ట్ర బీసీ నాయకులు, తాడి బోయిన చంద్రశేఖర్ యాదవ్ రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శి, ఏపీఐఐసీ చైర్మన్ మంత్రి రామరాజు, గుణపాఠి దీపక్ రెడ్డి -SEEDP chairman, పీతల సుజాత -ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల రక్షణ చట్టం చైర్మన్ తెలుగు మహిళ , ప్రకాశం గుంటూరు కృష్ణాజిల్లాల నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *