Breaking News

ప్రశాంతం గా ముగిసిన మూడవ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు

– విశాఖలో పరీక్షా కేంద్రాలను సందర్శించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ  బి.శ్రీనివాసరావు IAS,.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా మూడవ రోజు అనగా 05/10/2024 తేదీన ఇంగ్లీష్ మరియు హిందీ స్కూల్ అసిస్టెంట్స్ విభాగంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 21844 మందికి గాను 18932 మంది అభ్యర్థులు అనగా 86.66 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 77 సెంటర్లలో జరిగిన స్కూల్ అసిస్టెంట్స్ ఇంగ్లీష్ మరియు హిందీ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 14974మందికి గాను 13003 మంది అనగా 86.84 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 37 సెంటర్లలో జరిగిన స్కూల్ అసిస్టెంట్స్ హిందీ పరీక్షలకు 6870 మందికి గాను 5929 మంది అనగా 86.30 శాతం మంది హాజరయ్యారు. రెండవ రోజు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ప్రశాంతం గా ముగిసాయి అని ఏపీ టెట్ కన్వీనర్ శ్రీ ఎం.వి. కృష్ణా రెడ్డి  ఒక ప్రకటనలో తెలియజేసారు . పరీక్షా కేంద్రాలను‌ సందర్శించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ ఈ సందర్భంగా సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు  విశాఖపట్నంలో రెండు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. ఎస్పీడీ గారితో పాటు విశాఖపట్నం డీఈవో చంద్రకళ  పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు శ‌ర‌వేగంగా ఏర్పాట్లు

– కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి అధికారులు స‌మ‌ష్టిగా కృషిచేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు విజయవాడ, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *