Breaking News

రాష్ట్రంలో పీజీ వైద్య విద్య కోసం దాదాపుగా పూర్త‌యిన రిజిస్ట్రేష‌న్

-లేటు ఫీజు అవ‌స‌రం లేద‌న్న వైద్య విశ్వ‌విద్యాల‌యం
-వైద్య విద్యార్థుల ప్ర‌యోజ‌నం కోస‌మే చేప‌ట్టిన ప్ర‌క్రియ‌ ఇది అని స్పష్టం చేసిన వైద్య విశ్వవిద్యాలయం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పీజీ వైద్య విద్య‌ను ఆశిస్తున్న వైద్య విద్యార్థులంద‌రూ దాదాపు పూర్తిగా రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారు. డాక్ట‌ర్ ఎన్టీయార్ వైద్య విశ్వ విద్యాల‌యం జారీ చేసిన నోటిఫికేష‌న్ మేర‌కు రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ గ‌త నెల 27న మొద‌ల‌య్యింది. నేటి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు 8,645 మంది పీజీ వైద్య విద్య‌లో ప్ర‌వేశం కొర‌కు రిజిస్ట్రేష‌న్ చేసుకున్న‌ట్లు వైద్య విశ్వ‌విద్యాల‌యం అధికారులు తెలిపారు. ఈ ఏడాది జ‌రిగిన పీజీ నీట్ ప‌రీక్ష‌లో దాదాపు 9 వేల మంది పీజీ వైద్య విద్య కొర‌కు అర్హ‌త సాధించిన‌ట్లు స‌మాచారం

ఎన్టీయార్ వైద్య విశ్వ విద్యాల‌యం గ‌త నెల 27 నుండి రిజిస్ట్రేష‌న్ ప్రారంభించి ఈ నెల 4 వ‌ర‌కు అప్లికేష‌న్లు కోరింది. గ‌తానుభ‌వంతో వైద్య విద్యార్థుల‌కు ఎటువంటి ఇబ్బందులు క‌ల‌గకూడ‌ద‌న్న ఉద్దేశంతో ఈనెల 5,6, 7 తేదీల్లో లేటు ఫీజు చెల్లించి రిజిస్ట్రేష‌న్ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించారు. రిజిస్ట్రేష‌న్ షెడ్యూలుకు వ‌చ్చిన మంచి స్పంద‌న‌ను నిర్ధారిస్తూ ఈనెల 5,6 తేదీల్లో కేవ‌లం 16 మంది విద్యార్థులు మాత్రమే లేటు ఫీజుతో రిజిస్ట్రేష‌న్ చేసుకున్న‌ట్లు వైద్య విశ్వ‌విద్యాల‌యం అధికారులు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో లేటు ఫీజు రిజిస్ట్రేష‌న్‌కు బ‌దులుగా 5, 6, 7 తేదీల్లో జ‌రిగే రిజిస్ట్రేష‌న్‌ను సాధారణ‌ రిజిస్ట్రేష‌న్ గా ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు ఈ రోజు విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ ద్వారా వైద్య విశ్వ‌విద్యాల‌యం తెలిపింది. దీంతో సాధార‌ణ రిజిస్ట్రేష‌న్‌ను మూడు రోజుల పాటు పొడిగించిన‌ట్ల‌య్యింది.

నేడు కొన్ని దిన ప‌త్రిక‌ల్లో పీజీ అడ్మిష‌న్ల ప్ర‌క్రియ‌ను తొంద‌ర‌పాటుగా చేప‌డుతున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌లు స‌త్య‌దూర‌మ‌ని ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం అధికారులు స్ప‌ష్టం చేశారు. స‌కాలంలో మెరిట్ లిస్టు త‌యారుచేయ‌డానికి మాత్ర‌మే రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టిన‌ట్లు వారు వివ‌రించారు. కౌన్సిలింగ్ ప్ర‌క్రియ మాత్రం ఆలిండియా కోటా సీట్ల‌లో ప్ర‌వేశం కొర‌కు ఎన్ఎంసి ప్ర‌క‌టించే షెడ్యూల్ కు అనుగుణంగా మాత్ర‌మే రాష్ట్రంలో కౌన్సిలింగ్ జ‌రుగుతుంద‌ని వారు స్ప‌ష్టం చేశారు. గ‌తంలో లాగానే రాష్ట్రంలో కౌన్సిలింగ్ ప్రారంభానికి ముందు సీట్ మ్యాట్రిక్స్ ను ప్ర‌క‌టించి వైద్య విద్యార్థుల నుండి ఆప్ష‌న్లు కోరతామ‌ని అధికారులు తెలిపారు.

ఆలిండియా కోటా సీట్ల‌లో ప్ర‌వేశానికి గ‌త నెల 20న రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కాగా, రాష్ట్రంలో 27న మొద‌ల‌య్యింద‌ని, గ‌తంలో జ‌రిగిన విధంగానే ఈ ఏడాది కూడా కౌన్సిలింగ్ జ‌రుగుతుంద‌ని, ఈ విష‌యంలో ఎటువంటి అపోహ‌ల‌కు తావు లేద‌ని వారు తెలిపారు. దాదాపు 9 వేల మంది అభ్య‌ర్థుల ద‌ర‌ఖాస్తుల్ని వివిధ అంశాల‌కు సంబంధించి క్షుణ్ణంగా ప‌రిశీలించి, అభ్య‌ర్థుల అర్హ‌త‌ను నిర్ధారించి, మెరిట్ లిస్టును ప్ర‌క‌టించ‌డం స‌మ‌యంతో కూడిన ప‌ని అని, ఈ సుదీర్ఘ ప్ర‌క్రియ వ‌ల్ల పీజీ విద్య‌ను ఆశించే అభ్య‌ర్థుల‌కు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకూడదన్న ఉద్దేశంతో త‌గు చ‌ర్య‌ల్ని చేప‌ట్టిన‌ట్లు ఎన్టీయార్ వైద్య విశ్వవిద్యాల‌యం అధికారులు తెలిపారు.

త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర , ఉత్త‌ర ప్ర‌దేశ్ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, జ‌మ్మూ మ‌రియు కాశ్మీర్‌, పుదుచ్చేరి వంటి ప‌లు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ముగిసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *