విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదివారం తమ్ముల పల్లి కళాక్షేత్రం వెనుక శ్రీ వీరబాబు స్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు. ఎంపి కేశినేని శివనాథ్ కి దేవస్థానం కమిటీ సభ్యులు పండితుల వేద మంత్రోచ్ఛారణతో ఘన స్వాగతం పలికారు. ముందుగా ఎంపి కేశినేని శివనాథ్ శ్రీ వీరబాబు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దసరా నవరాత్రుల సందర్బంగా ఆలయం లో నెలకొల్పిన అమ్మవారిని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవిగా దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.దేవస్థాన కమిటీ వారు చిన్నారులతో ఏర్పాటు చేయించిన అమ్మవారి నృత్య ప్రదర్శిన తిలకించి నృత్యకళాకారులను ఎంపి కేశినేని శివనాథ్ అభినందించారు. అలాగే ఆ దేవస్థానంలో భక్తులకి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులు అన్న ప్రసాదం వడ్డించారు. రాష్ట్రంలోని ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు, శ్రీ వీరబాబు స్వామి అనుగ్రహం వుండాలని ప్రార్థించినట్లు ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వీరబాబు స్వామి దేవస్థానం అధ్యక్షుడు కొమ్మూరు బసవరాజు, ప్రధానకార్యదర్శి గొంట్లా రామమోహనరావు, కోశాధికారి కొప్పరపు వీరబాబు , ఉప కోశాధికారి బచ్చుల వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.