Breaking News

“జాబ్ మేళాలు”

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.08.10.2024 మంగళవారం నాడు విజయవాడ లోని “ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల” మరియు “నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) శిక్షణా కేంద్రం”kabela (centre)నందు “జాబ్ మేళాలు” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు (FAC), జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు సంయుక్తంగా తెలియజేసారు.

ఈ రెండు జాబ్ మేళాలో, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, గోదావరి ఆంధ్రా కోఆపరేటివ్ సొసైటీ, జీనియస్ కన్సల్టెంట్స్ లిమిటెడ్, ఇంటిగ్రిటీ హోమ్ సొల్యూషన్స్, AARK సెక్యూరిటీస్ అండ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, రిలయన్స్ రిటైల్ లిమిటెడ్, ఫ్లిప్‌కార్ట్, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కంపెనీ లలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు వారు అర్హులని, ఎంపిక అయిన వారికి నెలకు సుమారు రూ.10,000/- నుండి రూ.40,000/- ల వరకు వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, అక్టోబర్ 8 న నిర్వహించబోయే ఈ రెండు జాబ్ మేళాలకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు APSSDC సంస్థ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు గారు తెలిపారు.

ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా tinyurl.com/jobmela-vjdest (ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల) మరియు tinyurl.com/jobmela-vjdwst (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) శిక్షణా కేంద్రం) లింక్ ల నందు తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయ్యి, సదరు జాబ్ మేళాలకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్ మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని, మరిన్ని వివరాలకు 9347779032 (ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల) మరియు 9700025833 (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) శిక్షణా కేంద్రం) నంబర్ను సంప్రదించాలని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *