Breaking News

పాఠశాల అభివృద్ధికి పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) పాత్ర కీలకం

-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు 
-రాష్ట్ర స్థాయి రిసోర్సు పర్సన్లకు రెండు రోజుల శిక్షణ ప్రారంభం
-రెండు కేంద్రాల్లో దాదాపు 320 మంది రిసోర్సు పర్సన్లు హాజరు
-తొలిసారి పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు రాష్ట్ర స్థాయి శిక్షణలో ప్రాతినిధ్యం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల ప్రగతికి పాఠశాల యాజమాన్య కమిటీ కీలక పాత్ర వహించాలని, తద్వారా సత్ఫలితాల సాధన వైపు పయనించవచ్చని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. సోమవారం గుంటూరు జిల్లా పెదపరిమిలోని మువ్వా చిన బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్, ఏలూరు జిల్లా ఆగిరపల్లి హీల్ ప్యారడైజ్ కేంద్రాలుగా రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అన్ని జిల్లాల నుంచి ఎంపికైన ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్, దాదాపు 320 మంది స్టేట్ రిసోర్సు పర్సన్లుగా ‘పాఠశాల యాజమాన్య కమిటీ అభివృద్ధి’కి శిక్షణ పొందారు. సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., పెదపరిమిలో ఈ కార్యకమాన్ని ప్రారంభిస్తూ తొలిసారి పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు శిక్షణలో ప్రాతినిధ్యం కల్పించామన్నారు. పాఠశాల అభివృద్ధిలో భాగంగా అభ్యసన ఫలితాల (లెర్నింగ్ అవుట్ కమ్స్)పై దృష్టి సారించాలని అన్నారు. ఎస్ఎంసీలకు ప్రత్యేకమైన మొబైల్ యాప్ రూపొందిస్తున్నామని, దీని ద్వారా నేరుగా ఎస్ఎంసీ సభ్యులే అధికారుల దృష్టికి తమ పాఠశాల ప్రగతి, సమస్యను తీసుకువెళ్లవచ్చని అన్నారు. అనంతరం సమగ్ర శిక్షా, పాఠశాల విద్యాశాఖ రూపొందించిన ‘పాఠశాల యాజమాన్య కమిటీ’ కరదీపిక ఆవిష్కరించారు.

3 నుండి 8 సంవత్సరాల పిల్లలకు విద్యాపరంగా ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దినవారవుతారని అన్నారు. దీనికోసం పాఠశాల పనితీరు, విద్యార్థుల అభ్యసన స్థాయి, విద్యార్థులు మరుగుదొడ్లు వినియోగం, ప్రభుత్వ పథకాలు అమలు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు, విద్యార్థుల హాజరుశాతం వంటి వాటిపై ఎస్ఎంసీ సభ్యులు పర్యవేక్షించాలన్నారు. పాఠశాల అభివృద్ధికి, విద్యాహక్కు చట్టం అమలుకు, పాఠశాల ప్రగతికి, బాలల హక్కుల పరిరక్షణకు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  ఆదేశించినట్లు గుర్తు చేశారు.

‘హీల్’కేంద్రాన్ని సందర్శించిన సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య 
రెండో కేంద్రమైన ఏలూరు జిల్లా ఆగిరపల్లి ‘హీల్ ప్యారడైజ్’లో జరిగిన పాఠశాల యాజమాన్య కమిటీ వర్క్ షాపునకు అతిథిగా సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాల అభివృద్ధిని తమ బాధ్యతగా తీసుకునేలా ముందుకు సాగాలని అన్నారు. అనంతరం శిక్షాణార్థులతో కలిసి ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో సీమ్యాట్, శామో, సమగ్ర శిక్షా, కమ్యూనిటీ మొబలైజేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ప్రభుత్వ హౌసింగ్ లే అవుట్ మౌలిక సదుపాయాలు కల్పించాలి  కలెక్టరు ప్రశాంతి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ లే అవుట్ లలో మౌలిక సదుపాయాలు కల్పించడం కు తగిన ప్రాధాన్యత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *