-విజేతలను అభినందించిన అధికారులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ‘జూడో’లో ఆంధ్రప్రదేశ్ అండర్ – 14 బాలుర విభాగంలో రెండు కాంస్య పతకాలు సాధించినట్లు రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జి.భానుమూర్తి రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న 68వ జాతీయ స్కూల్ గేమ్స్ ఈ నెల 4 నుండి 7 వరకు గుజరాత్ రాష్ట్రం “మెహసాన”లో జరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను మరియు టీం కోచ్, మేనేజర్లను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డా. కృతికా శుక్లా IAS., సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., ప్రత్యేక అభినందనలు తెలిపారు.
విజేతలు:
1) -25 కేజీల విభాగంలో మాస్టర్ తలారి జయసింహ, 7 వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నసన్నకోట, రామగిరి మండలం ,శ్రీ సత్య సాయి జిల్లా.
2) -50 కేజీల విభాగంలో మాస్టర్ సయ్యద్,9 వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిగిచర్ల, ధర్మవరం మండలం, శ్రీ సత్య సాయి జిల్లా.