-బాధితులతో కలిసి పోరాటం చేస్తాం
-మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాత రాజరాజేశ్వరి పేట ప్రజలకు వైఎస్ఆర్సిపి అండగా ఉంటుందని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ 56 డివిజన్లోని దశాబ్దాలుగా ఉంటున్న పేద ప్రజలు ఇళ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్న రైల్వే అధికారులు తక్షణమే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మహంకాళిమ్మ రోడ్లు తమ ఇళ్లను తొలగించు వద్దంటూ దశాబ్ద కాలంగా ఉంటున్న ఆ ప్రాంతవాసులు నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. గతంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడున్న ప్రజలను ఇబ్బంది పెట్టిందని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయ రైల్వే వారికి స్థలం చూపించిన సరే కేంద్ర ప్రభుత్వం ఆనాడు సహకరించలేదని చెప్పారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరి పేద ప్రజలకు బాసటగా నిలవాలని లేని పక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధితులకు అండగా నిలిచి నిరసన కార్యక్రమంలో పాల్గొంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ యలకల చలపతి రావు, 55వ డివిజన్ కార్పొరేటర్ శిరంశెట్టి పూర్ణచంద్రరావు, బత్తుల పాండు, వాసా బాబు, పైడా శ్రీను, గొలగాని శ్రీనివాసరావు, అండలూరి లతా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News