-శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభించనున్న మంత్రులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి శనివారం రాష్ట్ర పర్యటన శాఖ ఆధ్వర్యంలో ఆరు దివ్య పుణ్య క్షేత్రములు సందర్శన కోసం ఏర్పాట్లు చెయ్యడం జరిగిందనీ, తొలి సర్వీసును రాష్ర్ట పర్యాటక సాంసృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా శనివారం ప్రారంభించనున్నట్లు పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి స్వామి నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
అక్టోబర్ 26 శనివారం ఉదయం 6 గంటలకు స్థానిక సరస్వతి ఘాట్ , జిల్లా పర్యాటక శాఖ కార్యాలయం రాజమహేంద్రవరం నుండి తొలి విడతగా ఒక రోజు పుణ్యక్షేత్ర సందర్శన బస్సు బయలుదేరడం జరుగుతోందని ఆయన తెలిపారు. ప్రతి శనివారం ఈ పుణ్యక్షేత్ర సందర్శన బస్సు బయలుదేరుతుందన్నారు. భక్తుల కోరిక మేరకు ఆదివారం కూడా ప్రత్యేక బస్సు సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనీ కోరుకొండ – శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, అన్నవరం – శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం , సామర్లకోట – శ్రీ కుమార భీమేశ్వర స్వామి వారి దేవస్థానం , ద్రాక్షారామం – శ్రీ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం , వాడపల్లి – శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సందర్శన నకు ఏర్పాట్లు చెయ్యడం జరిగిందన్నారు. పెద్ద లకి రూ.1000 లు , మూడు నుంచి 10 ఏళ్ల లోపు పిల్లలకు రూ.800 లుగా టికెట్ ధర నిర్ణయించడం జరిగిందన్నారు. టికెట్స్ బుకింగ్ కోసం 9848629341 లేదా 98488 83091 నేరుగా సంప్రదించి టికెట్స్ బుక్ చేసుకునే సౌలభ్యం అందుబాటులొ ఉంచినట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News