ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఇంద్రకీలాద్రి పై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం లో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలను పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) పరిశీలించారు. ఆలయ ఈవో కేఎస్ రామారావు , ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈవో కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన దుర్గగుడి మాస్టర్ ప్లాన్ ను పరిశీలించామని ఆలయ అభివృద్ధికి అవసరమయ్యే సలహాలను, సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. అధికారుల, ప్రజాప్రతినిధుల అందరి సమన్వయంతో దసరా ఉత్సవాలను విజయవంతం చేశామన్నారు. త్వరలో జరగబోయే భవాని దీక్ష విరమణలు కూడా విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. భవానీలకు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రానున్న ఐదేళ్ల కాలంలో అమ్మవారి ఆశీస్సులతో ఇంద్రకీలాద్రిని, పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వెస్ట్ ను బెస్ట్ గా మార్చి ఆదర్శ నియోజవర్గంగా తీర్చుదిద్దుతామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. అనంతరం దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ఈవో కేఎస్ రామారావు సుజనా కు స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనాలను అందజేశారు.
Prajavartha Online Telugu News