Breaking News

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పటిష్టవంతంగా పనిచేసేలా చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం చూపేలా జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పటిష్టవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సీసీఎల్ఏ జి. జయలక్ష్మి మంగళవారం అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార విభాగం (పిజిఆర్ఎస్) క్రింద వివిధ జిల్లాలలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార పురోగతి, ఫ్రీ హోల్డ్ లాండ్స్ వెరిఫికేషన్, వాటర్ టాక్స్ కలెక్షన్ అంశాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె. చంద్రశేఖర రావు కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార పురోగతి వివరించారు.

ప్రజల నుండి అందిన అర్జీలు గడువులోగా సత్వర పరిష్కార చర్యలు తీసుకుంటున్నామని, గడువు దాటినవి ఏమీ లేవని, ముఖ్యంగా రీఓపెన్ తగ్గించుటకు తాసిల్దార్లు తదితర అధికారులు వారికి వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, అర్జీ దారులతో మాట్లాడి వారి సమస్యలు లోతుగా తెలుసుకొని, అర్జీదారుకి సంతృప్తి కరంగా సమగ్ర పరిష్కారం చేయుటకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు. పరిష్కారమైన వాటికి ఇస్తున్న ఎండార్స్మెంట్లు అప్లోడ్ చేయడంతో పాటు అర్జీదారునికి అందేలా కృషి చేస్తున్నట్లు, తద్వారా రీఓపెన్ చాలా వరకు తగ్గించుటకు కృషి చేస్తున్నామన్నారు. వాటర్ టాక్స్ కలెక్షన్ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గ్రీవెన్స్ సెక్షన్ సూపర్డెంట్ బేగ్, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *