Breaking News

గౌరవ సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు వారి మార్గదర్శకాలు మేరకు అవగాహన కల్పించాలి

-ద్విచక్ర వాహనదారులందరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.
-జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ద్వికచ్ర వాహనాలు నడిపే వారందరు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ప్రథాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత పేర్కొన్నారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాదాలు పై అవగాహనా కార్యక్రమానికి జిల్లా జడ్జి శ్రీమతి గంధం సునీత ముఖ్య అతిథిగా హాజరై ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్లను పంపిణి చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రథాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాలు, రాష్ట్ర హైకోర్టు వారి సూచనల మేరకు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనాన్ని నడిపే వారందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలన్నారు. హెల్మెట్లు ధరించని కారణంగా ప్రమాద సమయంలో గాయాలు ఎక్కువగా తగిలే అవకాశం ఉందని పేర్కొన్నారు. గత మాసంలో ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ర్యాలీని కూడా నిర్వహించడం జరిగిందని స్పష్టం చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద బ్యాంకర్స్, హార్లిక్స్ ఫ్యాక్టరీ, ఏపీ పేపర్ మిల్క్ యాజమాన్యాలతో సంప్రదించి వారి సహకారంతో హెల్మెట్ పంపిణీ ప్రక్రియకు జాబితాను సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా హెల్మెట్ కొనుగోలు చేయలేని ప్రభుత్వ కళాశాలలో పేద విద్యార్థులకు, జూనియర్ అడ్వకేట్లకు గత 15 రోజులు క్రితం 148 హెల్మెట్లను పంపిణీ చేసామన్నారు. స్టేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వారు సహకారంతో 250 హెల్మెట్లను పంపిణీ నిమిత్తం అందచేశారన్నారు. నేడు ప్రభుత్వ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న బాలికలకు, బాలురుకు, జూనియర్ అడ్వకేట్లకు హెల్మెట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వలన రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయని అనుకోని ప్రమాదాలకు గురైనప్పుడు సురక్షితంగా గాయాలు నుంచి తప్పించుకొని ప్రాణాలను కాపాడుకొనే అవకాశం ఉందన్నారు. హెల్మెట్ ధరించలేదని డిఫెన్స్ వాదన కూడా ఉండదన్నారు. నేడు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ చేసే విధంగా మార్గదర్శకాలు ఇచ్చిన సుప్రీంకోర్టు, హైకోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. అదేవిధంగా మేము అడిగిన వెంటనే బ్యాంకర్ల ప్రతినిధులు ముందుకు వచ్చి హెల్మెట్లను పంపిణీ నిమిత్తం అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సేవాధికార సంస్థ సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రకాష్ బాబు,
బార్ అసోసియేషన్ సెక్రెటరీ పి.రమేష్, ఎస్బిఐ రీజినల్ మేనేజర్ టి.శ్రీనివాస్, కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ జి. రఘుకుమార్,బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ కెవిఎన్, ప్రసాద్ ఆర్ట్స్ కళాశాల, ఉమెన్స్, ఎస్ కే వి టి కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు , జూనియర్ అడ్వకేట్లుతదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కళాకారులకు చేయూత… కొండపల్లి బొమ్మలకు కొత్త దిశ

– ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *