Breaking News

ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం అభివృద్ధి సమగ్ర ప్రణాలికలు సిద్దం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం అభివృద్ధి సమగ్ర ప్రణాలికలు సిద్దం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ జిఎంసి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కమిషనర్ బృందావన్ గార్డెన్స్ లోని జిఎంసి ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంను స్థానిక వాకర్స్, జిఎంసి అధికారులతో కలిసి పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ ఎన్టీఆర్ స్టేడియంను క్రీడల హబ్ గా, ఉదయం సాయంత్రం వాకింగ్ చేసుకునే వారికి ఆహ్లాదంగా, సమగ్ర మౌళిక వసతుల కేంద్రంగా తీర్చిదిద్దడానికి తగిన ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. టేబుల్ టెన్నిస్, షటిల్, వాలీబాల్, బ్యాడ్మింటన్ కోర్ట్ లను, పురుషుల, మహిళల జిమ్ లను పరిశీలించి, ప్రతి రోజు ఆయా క్రీడలకు ఎంత మంది వస్తున్నారు, స్టేడియం సభ్యుల వివరాలను అడిగి తెలుసుకొన్న కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ స్టేడియంలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కొన్ని చోట్ల స్లాబ్ పెచ్చులు ఊడిందని, గోడలు బీటలు వచ్చాయని, వాటిని వెంటనే మరమత్తు చేయాలన్నారు. జిమ్ ల్లో ఆధునాతన ఎక్విప్మెంట్ ఏర్పాటుకు, బ్యాడ్మింటన్ గ్రౌండ్ లో లైట్లు, ఇతర అవసరమైన ఏర్పాట్లు చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. అనంతరం కమిషనర్ టేబుల్ టెన్నిస్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

పర్యటనలో ఎస్.ఈ. నాగమల్లేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, ఈఈ కోటేశ్వరరావు, డిఈఈ రమేష్, ఏఈ చైతన్య, శానిటరీ ఇన్స్పెక్టర్ అంగడి బాబు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *