-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
టీడీపీతోనే బీసీలకు రాజ్యాధికారం లభించిందని, వెనుకబడిన తరగతుల అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఇటీవల కురుబ కార్పొరేషన్ చైర్మన్ నియమితులైన మాన్వి దేవంద్రప్ప, కళింగ కార్పొరేషన్ రోణింకి కృష్ణంనాయుడుతో పాటు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి… వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో మంత్రి కార్యాలయంలో మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కార్పొరేషన్ల చైర్మన్లగా నియమితులైన రోణింకి కృష్ణంనాయుడు, మాన్వి దేవంద్రప్పను మంత్రి అభినందించారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతే లక్ష్యంగా టీడీపీ ఆవిర్భవించిందన్నారు. బీసీలకు అన్న ఎన్టీఆర్ రాజ్యాధికారంలో భాగస్వామం చేశారన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు బీసీల రాజ్యధికారం కల్పించడమే కాకుండా ఆర్థిక అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుత బడ్జెట్ లో రూ.39 వేల కోట్లను బీసీల కోసం కేటాయించారన్నారు. 2014-19లో అమలు చేసిన పథకాలను పున: ప్రారంభించడానికి సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ నెల 18న అనంతపురంలో జరగనున్న భక్త కనకదాస రాష్ట్ర స్థాయి జయంతి కార్యక్రమంలో భారీ సంఖ్యలో తరలిరావాలని కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవంద్రప్పకు మంత్రి సవిత సూచించారు.
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కళింగ, కురుబ కార్పొరేషన్ల చైర్మన్లు రోణంకి కృష్ణంనాయుడు, మాన్వి దేవేంద్రప్పకు మంత్రి సవిత సూచించారు. కార్పొరేషన్ల పరిధిలో అమలు చేస్తున్న పథకాలను అర్హులకు పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. కార్పొరేషన్ల చైర్మన్లు రోణంకి కృష్ణంనాయుడు, మాన్వి దేవేంద్రప్ప మాట్లాడుతూ, తమపై ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తామన్నారు. తమకు అవకాశమచ్చిన సీఎం చంద్రబాబునాయుడుకు, మంత్రులు లోకేశ్ కు, మంత్రి సవితకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మంత్ర సవితను కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవంద్రప్ప ఘనంగా సత్కరించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించనున్న భక్త కనకదాస జయంత్యోత్సవాల్లో పాల్గొనాలని మంత్రిని కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవంద్రప్ప ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.