సినిమాల సమాచారం…

నేటి పత్రిక ప్రజావార్త :

అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రంకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘థ్యాంక్యూ’ చిత్రంలో ప్రధాన కథానాయికగా నభా నటేష్ ను తాజాగా ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది.
*  పవన్ కల్యాణ్ కథానాయకుడుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వకీల్ సాబ్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 3న నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.
*  తాజాగా హిట్లు కొట్టిన ఓ హీరో.. మరో దర్శకుడి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. ‘ఉప్పెన’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వైష్ణవ్ తేజ్.. తాజాగా ‘జాతిరత్నాలు’ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు అనుదీప్ కేవీ కలసి ఓ చిత్రాన్ని చేయనున్నారు. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

* అందాలతార కాజల్ అగర్వాల్ తాజాగా నాగార్జున సరసన నటించనుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందే చిత్రంలో కాజల్ నాయికగా నటిస్తోంది. ఈ విషయాన్ని కాజల్ తెలుపుతూ.. ఈ చిత్రం షూటింగులో తాను ఈ నెల 31న జాయిన్ అవుతాయని చెప్పింది.
*  మలయాళంలో హిట్టయిన ‘లూసిఫర్’ చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగును వచ్చే నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలి షెడ్యూలును తమిళనాడు లోని గ్రామీణ ప్రాంతంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారట.
*  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న ‘లవ్ స్టోరీ’ చిత్రానికి బిజినెస్ పరంగా మంచి ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయట. మొత్తానికి ఈ చిత్రం థియేట్రికల్ హక్కులు సుమారు 30 కోట్లకు అమ్ముడుపోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల 16న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Check Also

మహేశ్ బాబు పుత్రోత్సాహం.. ఎందుకో తెలుసా?

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *