-300 మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సు డ్రైవర్లు అయ్యే అవకాశం -రూ.136 కోట్లతో ఈ ఏడాది ఉపాధి, శిక్షణలు -మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ మహిళలకు ఆర్టీసీలో బస్సు డ్రైవర్లుగా నియమించడానికి అవసరమైన హెవీ వెహికల్ డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వనున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. శిక్షణానంతరం దాదాపు 320 మహిళలు బస్సు డ్రైవర్లుగా ఉద్యోగాలను పొందే అవకాశం ఉందని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ ఏడాది …
Read More »Tag Archives: AMARAVARTHI
వి.ఐ.టి – ఏ.పి విశ్వవిద్యాలయంలో వి.ఐ.టి – ఏ.పి స్కూల్ ఆఫ్ లా ఆధ్వర్యంలో మొదటి ఇంట్రా మూట్ కోర్ట్ పోటీలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వి.ఐ.టి – ఏ.పి స్కూల్ ఆఫ్ లా ఆధ్య్వర్యంలో రెండు రోజుల ఇంట్రా మూట్ కోర్ట్ పోటీలు 17 మరియు 18 మే 2022 న నిర్వహించారు. ఈ పోటీలలో బి.ఏ. ఎల్ ఎల్.బి(హానర్స్) మరియు బి.బి.ఏ. ఎల్ ఎల్ .బి. (హానర్స్) కోర్సులకు చెందిన మొదటి , రెండు సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులు 18 జట్లుగా పోటీపడ్డారు. ఈ జట్లలో 8 జట్లు క్వార్టర్-ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఇందులో మంతెన భవ్య శ్రీ, పెనుమాక శ్రీ …
Read More »ఘనంగా సౌత్ ఆఫ్రికా మహానాడు వేడుకలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరుపుకుంటున్న సందర్భంలో అన్న ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ సందర్భంగా సౌత్ ఆఫ్రికాదేశంలో టిడిపి ఎన్‌ఆర్‌ఐ శాఖ ఘనంగా మహానాడు వేడుకలు 14 మేన జోహన్స్‌బర్గ్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి భారతదేశం నుంచి ప్రత్యేకంగా మాజీ మంత్రి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇంచార్జ్ జవహర్ మరియు తెలుగుదేశం జనరల్ సెక్రెటరీ గౌతు శిరీష హాజరయ్యారు. సౌత్ ఆఫ్రికాలో ఉన్న వివిధ నగరాల నుంచి టీడీపీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. …
Read More »వి.ఐ.టి -ఏ.పి విశ్వవిద్యాలయంలో ఆర్ .ఎఫ్ మరియు మైక్రోవేవ్ సాంకేతికతపై జాతీయ స్థాయి వర్క్ షాప్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వి.ఐ.టి -ఏ.పి విశ్వవిద్యాలయంలో ఆర్.ఎఫ్ మరియు మైక్రోవేవ్ సాంకేతికతపై జాతీయ వర్క్ షాప్ ది. 14 మే 2022 న వర్చ్యువల్ విధానంలో ప్రారంభమయ్యింది. ఈ వర్క్ షాప్ వారం రోజుల పాటు జరగనుంది. ఈ వర్క్‌షాప్ లో ఔత్సాహిక పరిశోధకులు , అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, Ansys మరియు HFSS పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మైక్రోవేవ్ రంగంలో తమ పరిశోధన లక్ష్యాలను చేరుకోవటానికి ఉపయోగపడుతుంది. ఈ వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ శరత్ కుమార్ …
Read More »తాడేపల్లి పోలకంపాడులో ఇంప్‌కాప్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అతి పురాతనమైన ఆయుర్వేదంలో సకల వ్యాధులకు ఆయుర్వేద మందులను మరింత చేరువ చేసేందుకు ది ఇండియన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కో-ఆపరేటివ్ ఫార్మశీ & స్టోర్స్ (ఇంప్‌కాప్స్) చెన్నైవారి 2వ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ గుంటూరు జిల్లా, తాడేపల్లి పోలకంపాడులో ఏప్రిల్ 28 ప్రారంభించినట్లు ఇంప్‌కాప్స్ డైరెక్టర్ డాక్టర్ వేముల భానుప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ వేముల భానుప్రకాష్ మాట్లాడుతూ ఇంప్‌కాప్స్ 1944లో చెన్నైలో, 1983లో తాడేపల్లి పోలకంపాడులో ప్రారంభమయ్యాయి. ఈ కంపెనీ …
Read More »రహదారులపై సీఎం వైయస్.జగన్ సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో రోడ్లు, సంబంధిత అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో రోడ్లన్నింటినీ బాగు చేయడానికి ప్రభుత్వం చాలా ప్రణాళికబద్ధంగా పనిచేస్తోంది. ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ ముందుకుసాగుతోంది. దీనికోసం ప్రభుత్వం, అధికారులు చాలా కష్టపడుతున్నారు. పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా మనపై విమర్శలు చేస్తున్నారు, వక్రీకరణలు …
Read More »మహిళలపై నేరాలు – పరిష్కారాలపై చర్చాగోష్టి నేడు..
-మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ‘మహిళలపై నేరాలు, పరిష్కారాలు’ ప్రధాన అజెండాగా చర్చాగోష్టి మంగళవారం నిర్వహిస్తున్నట్లు కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఓ ప్రకటనలో వెల్లడించారు. విజయవాడ కానూరులో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చర్చాగోష్టి కొనసాగుతుందన్నారు. కోవిడ్ తర్వాత మహిళలపై నేరాలు ఆందోళన కలిగిస్తున్న నేపధ్యంలో ఈ చర్చాగోష్టి …
Read More »జూన్ 30వ తేదీలోగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్ డిక్లరేషన్ కు చర్యలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సచివాలయాల శాఖకు కృతజ్ఞతలు : ఎం.డి.జాని పాషా
-ప్రోబేషన్ ప్రక్రియ ప్రారంభించినందున రాష్ట్ర ముఖ్యమంత్రికు కృతజ్ఞతలు -జూన్ 30 లోగా ప్రోబేషన్ ప్రక్రియ పూర్తి ఐతే ముఖ్యమంత్రికు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి సచివాలయాల శాఖ ద్వారా సచివాలయ ఉద్యోగులతో కృతజ్ఞత సభ ఏర్పాటు చేస్తాం : గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి జనవరి7వ తేదీన చేసిన ప్రకటన ప్రకారం …
Read More »ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రారంభమైన జనసేన కౌలు రైతు భరోసా యాత్ర
కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : కౌలు రైతు మేకల నాగ సుబ్బారాయుడు కుటుంబానికి రూ. లక్ష ఆర్ధిక సాయం ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభమయ్యింది. యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గానికి చెందిన కౌలు రైతు మేకల నాగ సుబ్బారాయుడు కుటుంబాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అతని భార్య భూలక్ష్మిని ఓదార్చారు. సుబ్బారాయుడు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ఆత్మహత్య అనంతరం ప్రభుత్వ స్పందన గురించి అడిగి …
Read More »వి.ఐ.టి.-ఏ.పి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వాతావరణ సంక్షోభం మరియు భవిష్యత్తు ప్రభావాలపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విఐటి-ఎపి స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ & హ్యుమానిటీస్, వి.ఐ.టి.-ఏ.పి విశ్వవిద్యాలయం, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ (SICOM) మరియు జియో క్లైమేట్ రిస్క్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (GCRS) ల విజ్ఞాన భాగస్వామ్యంతో “రెండు రోజుల వాతావరణ సంక్షోభం మరియు భవిష్యత్తు ప్రభావాలపై అంతర్జాతీయ సదస్సు”ను నిర్వహిస్తుంది. రెండు రోజుల వర్చువల్ కాన్ఫరెన్స్ శనివారం 7 మే 2022న ప్రారంభమై 8 మే 2022న ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి …
Read More »