అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వి.ఐ.టి -ఏ.పి విశ్వవిద్యాలయంలో ఆర్.ఎఫ్ మరియు మైక్రోవేవ్ సాంకేతికతపై జాతీయ వర్క్ షాప్ ది. 14 మే 2022 న వర్చ్యువల్ విధానంలో ప్రారంభమయ్యింది. ఈ వర్క్ షాప్ వారం రోజుల పాటు జరగనుంది. ఈ వర్క్‌షాప్ లో ఔత్సాహిక పరిశోధకులు , అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, Ansys మరియు HFSS పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మైక్రోవేవ్ రంగంలో తమ పరిశోధన లక్ష్యాలను చేరుకోవటానికి ఉపయోగపడుతుంది. ఈ వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ శరత్ కుమార్ పాత్ర (డైరెక్టర్, ఐఐఐటీ వడోదర) హాజరయ్యారు.ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో 5జి /6జి సమాచార రంగాలలో ఆర్.ఎఫ్ /మైక్రోవేవ్‌ల ప్రాముఖ్యతను తెలియచేసారు. వి.ఐ.టి -ఏ.పి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా || ఎస్.వి. కోట రెడ్డి మాట్లాడుతూ మన దైనందిన జీవితంలో ఎలక్ట్రానిక్ పరికరాల ప్రాముఖ్యత, మరియు రక్షణ, వాణిజ్య మరియు టెలికమ్యూనికేషన్ పరిశ్రమలో ఆర్.ఎఫ్ మరియు మైక్రోవేవ్ భాగాల పాత్రను వివరించారు. ఐఐటి రూర్కీ, ఎన్ఐటి సిల్చార్, మిజోరాం విశ్వవిద్యాలయం వంటి కేంద్ర విద్య సంస్థలతో పాటు ప్రముఖ పరిశ్రమలకు చెందిన వక్తలు ఈ వర్క్ షాప్ లో ప్రసంగించనున్నారు. వర్క్‌షాప్‌కు Entuple. Ansys, Anritsu, IEEE MTTS Society మరియు IEEE APS Societyలు సహ స్పాన్సర్‌లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ వర్క్‌షాప్ లో 13 రాష్ట్రాల నుండి మొత్తం 59 మంది పాల్గొన్నారు. వీరిలో 36 మంది NITలు, IIITలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ,ఆల్ ఇండియా రేడియో, ప్రసిద్ధ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల నుండి హాజరయ్యారు. మిగిలిన 23 మంది విశ్వవిద్యాలయ అధ్యాపకులు మరియు రీసెర్చ్ స్కాలర్‌లు అంతర్గత భాగస్వాములుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ షాప్ కోఆర్డినేటర్లు డా|| జయేంద్ర కుమార్, డా|| ఖైర్నర్ వికాస్ విష్ణు, డా|| చందు, డా|| ఎస్. పెద్ద కృష్ణ, డా|| బప్పాదిత్య రాయ్ మరియు డా|| యం . జగదీష్ చంద్ర (డీన్, అకాడెమిక్స్ ), విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News