జిల్లాలో ఈరోజు 2వ ఏడాది ఇంటర్, ఒకేషనల్ పరిక్షలకి 97.55 శాతం మంది విద్యార్థులు హాజరు…

-హాజరైన ఇంటర్ విద్యార్థులు 98.35 % ఓకేషనల్ విద్యార్థులు 91.49%
-కలెక్టర్ కే.మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటర్మీడియేట్ 2వ సంవత్సరం గణితం పేపర్- II B; జువాలజీ పేపర్-II ; చరిత్ర పేపర్-II పరీక్షలకు ఇంటర్ విద్యార్ధులు 13,157 మంది (98.35 %), ఓకేషనల్ విద్యార్థులు 1635 మంది (91.49 %) పరీక్షకు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలియచేశారు. తూర్పు గోదావరి జిల్లాలో 49 పరీక్షా కేంద్రాల లో ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షా కోసం 13,377మంది, ఒకేషనల్ కోర్సు 2వ ఏడాది పరీక్షలకు 1,787 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. రాజమండ్రి డివిజన్ పరిధిలో 32 కేంద్రాలలో 2వ ఏడాది ఇంటర్ 9, 748 మందికి గాను 9, 604 మంది హాజరు కాగా 144 మంది హాజరు కాలేదన్నారు. ఒకేషనల్ కోర్సు కి సంబందించిన 1, 012 కి గానీ మందికి గాను 922 మంది హాజరు కాగా 90 మంది హాజరు కాలేదని తెలిపారు. కొవ్వూరు డివిజన్ పరిధిలో పరిధిలో 17 కేంద్రాలలో ఈరోజు ఇంటర్ పరీక్షలకి 3, 629 మందికి గాను 3, 553 మంది హాజరు కాగా 76 మంది హాజరు కాలేదన్నారు. ఒకేషనల్ కోర్సు కి సంబందించిన 775 కి గానీ మందికి గాను 713 మంది హాజరు కాగా 62 మంది హాజరు కాలేదని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *