-కాలనీలో లబ్ధిదారులకు అత్యాధునిక వసతుల కల్పన…
-ప్రైవేట్ లేఅవుట్ల స్థాయికి మించి పక్కా వాస్తుతో గృహాల నిర్మాణం…
-అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రూరల్ మండలం నున్నలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీ లేఅవుట్ రాష్ట్రంలోనే జగనన్న కాలనీలకే ఒక మోడల్ కాలనీగా గుర్తింపు పొందుతుందని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. నున్న వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్‌కు సంబంధించిన బ్రోచర్‌ను శనివారం జిల్లా కలెక్టర్ నగరంలోని ఆయన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 114.30 ఎకరాల సువిశాలమైన స్థలంలో 6,363 ప్లాట్‌లతో నిర్మిస్తున్న వైఎస్సార్ జగనన్న కాలనీ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన కాలనీగా గుర్తింపు తేచ్చుకునేలా నిర్మాణం జరగడం అభినందనీయమన్నారు. సహజంగా గృహస్థులు వారి గృహాల ఫేసింగ్ తూర్పు, పడమర దిశలలో ఉండాలని ఆశిస్తారన్నారు. ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటిలలో కూడా సాద్యపడనివిధంగా మొత్తం 6,363 ప్లాట్లలోని గృహాలు మొత్తం తూర్పు, పడమర ఫేసింగ్‌తో లేఅవుట్లను రూపొందించడం జరిగిందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నివసిస్తున్న పట్టణ ప్రాంత లబ్ధిదారులకు కేటాయించిన ఈ నున్న జగనన్న కాలనీ లేఅవుట్ పూర్తి అయితే లబ్దిదారులు మరో నూతన పట్టణంలో నివాసిస్తున్నామన్న అనుభూతిని పొందుతారన్నారు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావారణంలో కృష్ణా, గోదావరి జలాల త్రాగునీటి సదుపాయం కలిగి కాలనీలోనే నివాసితులకు అవసరమైన మౌలిక సదుపాయలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. రైతు బజార్, షాపింగ్ మాల్స్, ఉన్నత విద్య, ఆధునిక వైద్య వంటి సౌకర్యాలు నున్న జగనన్న కాలనీ లేఅవుట్ల లబ్ధిదారులకు అందుబాటులో ఉంటాయన్నారు. 6,363 ప్లాట్‌లో గృహా నిర్మాణాలను నిర్మించే మహ యజ్ఞంలో భాగ్యస్వామ్యులు కావడం అదృష్టంగా భావించి వేలాదిమంది నీరుపేదలకు ఆధునిక వసతులతో కూడిన సొంత ఇంటి కల నేరవేర్చుతున్నామన్న సంకల్పంతో మరింత ఉత్సాహాంతో పనిచేసి నిర్థేశించిన గడువుకు ముందే గృహా నిర్మాణాలు పూర్తి అయ్యేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. నున్న జగనన్న కాలనీ లేఅవుట్ బ్రోచర్ విడుదల కార్యక్రమంలో యంపిడివో జె. సునీత, తహాశీల్థార్ శ్రీనివాస్‌నాయక్, హౌసింగ్ డిఇ యంఎన్ మల్లేశ్వరరావు, ఎఇ సిహెచ్ ఎస్‌ఎస్ ఆర్‌వి ప్రసాద్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రామ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News