అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం వరించింది. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ వ్యాపార ప్రతిపాదన సంస్థ యూ.ఎస్-ఇండియా ఎస్.ఎమ్.ఈ కౌన్సిల్ (U.S.-India SME Council, Inc.) మంత్రి విశేష సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రకటించింది. యూ.ఎస్-ఇండియా ఎస్.ఎమ్.ఈ కౌన్సిల్ వాషింగ్టన్ డీసీలో ప్రధాన కార్యాలయం కలిగిన ఒక లాభాపేక్షలేని సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న …
Read More »Tag Archives: amaravathi
ఏపీ సూపర్ కప్ 2026 గెలుచుకున్న సిటాడెల్ గోదావరి లెజెండ్స్
అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురం ఆర్‌డీటీ స్టేడియంలో బుధవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో సిటాడెల్ గోదావరి లెజెండ్స్ ఎఫ్‌సీ ఏపీ సూపర్ కప్ ఫుట్‌బాల్–2026ను సొంతం చేసుకుంది. అదనపు సమయం తర్వాత జరిగిన పెనాల్టీ షూటౌట్‌లో కోరమండల్ ఎఫ్‌సీపై 3–0 గోల్స్‌తో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఇరు జట్లు సమానంగా పోటీపడ్డాయి. నిర్దేశిత సమయంలోనూ, అదనపు సమయంలోనూ గోల్స్ నమోదు కాలేదు. దృఢమైన రక్షణాత్మక ఆటతో ఇరు జట్ల డిఫెండర్లు …
Read More »అంబేద్కర్ గరుకులాల్లో 100 శాతం ఉత్తీర్ణత, 100 శాతం అడ్మిషన్లే లక్ష్యం
-ఉత్తీర్ణత శాతం పెంచితే డిసివోలు, ప్రిన్సిపాళ్లకు సన్మానాలు, ఉత్తీర్ణతా శాతం తగ్గితే మెమోలు -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి -అంబేద్కర్ గురుకులాల డీసీవోలు, ప్రిన్సిపాళ్ళతో మంత్రి డా. స్వామి జామ్ వీడియో కాన్ఫరెన్స్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డా.బి ఆర్ అంబేద్కర్ గరుకులాల్లో 100 శాతం ఉత్తీర్ణత,100 శాతం అడ్మిషన్లే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం తాడేపల్లి APSWREIS కార్యాలయంలో డీసీవోలు, ప్రిన్సిపాళ్ళతో మంత్రి జామ్ వీడియో …
Read More »సీఎం చంద్రబాబు నాయుడు ఆశయ సాధనకు అనుగుణంగా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది పనిచేయాలి
-స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులందరికీ పదోన్నతుల కల్పనకు చర్యలు -స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలపై పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక అధికారుల నియామకం -ప్రజల్లో సంతృప్తి పెంపే లక్ష్యంగా సిబ్బంది మెరుగైన సేవలందించాలి -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి -వెలగపూడి సచివాలయంలో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అధికారులతో మంత్రి డా. స్వామి సమీక్ష సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయ సాధనకు అనుగుణంగా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల …
Read More »రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధిపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తో మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష
-పర్యాటక రంగ బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం రూ. 150 కోట్ల ప్రతిపాదన -విశాఖ, తిరుపతిలను అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. అన్ని జిల్లాల్లో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే తమ ధ్యేయమని మంత్రి దుర్గేష్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, పర్యాటక రంగ అభివృద్ధి, నిధుల కేటాయింపులపై వెలగపూడి సెక్రటేరియట్‌లో కీలక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తో …
Read More »మనమిత్ర హాయ్ గా ఉంది
-అరకోటికి పెరిగిన యూజర్లు -2.50 కోట్లకుపైగా సేవలు (లావాదేవీలు) అందుకున్న యూజర్లు -వాట్సప్ గవర్నెన్స్ కు గణనీయంగా పెరుగుతున్న ఆదరణ -ఉన్న చోటు నుంచే క్షణాల్లో పనులు పూర్తి -బిల్లుల చెల్లింపుల నుంచి పట్టాదారు పాసుపుస్తకాల డౌన్‌లోడు వరకు -అన్నీ మొబైల్ ఫోనులోనే పూర్తి చేసుకునే సదుపాయం -రాష్ట్రం బయట ఉన్న ఏపీ వారూ ఉపయోగించుకుంటున్న తీరు -ప్రతి ఇంటి చిరునామాగా మారిన మనమిత్ర నెంబరు 9552300009 అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరుకు చెందిన ఎం. కిశోర్ బెంగళూరులో ఛార్టెర్డ్ అకౌంటెంటుగా …
Read More »రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగ బ్యాక్ ల్యాగ్ పోస్టులు మార్చిలోపు భర్తీ చేయాలి
-దివ్యాంగ పాఠశాలల్లో అడ్మిషన్లపై విస్తృత ప్రచారం కల్పించాలి, అడ్మిషన్లు 100 శాతం పూర్తి కావాలి -దివ్యాంగులకు ఉచిత త్రీవీలర్ మోటార్ సైకిళ్ల పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి -వెలగపూడి సచివాలయంలో దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి డా. స్వామి సమీక్ష సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగ బ్యాక్ ల్యాగ్ పోస్టులు ఈ ఏడాది మార్చిలోపు భర్తీ చేయాలని దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ మంత్రి …
Read More »వ్యవసాయ, అనుబంధ శాఖల అభివృద్ధికి అదనపు నిధులు కేటాయించండి
– ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌తో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు భేటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, ముందస్తుగా బడ్జెట్ కూర్పుపై రాష్ట్ర వ్యవసాయ మరియు పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతన్నలకు బలమైన అండగా నిలిచేలా వ్యవసాయ, అనుబంధ శాఖల అభివృద్ధికి, అలాగే రాష్ట్రంలో పాడి పరిశ్రమను …
Read More »ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా ఎక్సైజ్ సుంకం హర్షణీయం
– పొగాకు రైతులకు, చిరు వ్యాపారులకు పెద్ద ఊరట – మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాండ్ లేని ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని సున్నా శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాగతిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని పొగాకు రైతులు, చిరువ్యాపారులకు ప్రత్యక్షంగా లాభం చేకూరుస్తుందని పేర్కొన్నారు. పొగాకు HS కోడ్ 2401 కిందకు వచ్చే, రీటైల్ విక్రయాల …
Read More »బడ్జెట్ కూర్పుపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రులు సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, ముందస్తుగా బడ్జెట్ కూర్పుపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, హోం మంత్రి వంగలపూడి అనిత పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు హోం శాఖకు అవసరమైన నిధుల కేటాయింపులపై సుదీర్ఘంగా చర్చించారు. పోలీస్ శాఖ మౌలిక వసతుల అభివృద్ధి, ఆధునిక సాంకేతిక …
Read More »
Prajavartha Online Telugu News