Breaking News

Tag Archives: delhi

రాష్ట్రంలో 1,04,396 చెట్లు న‌రికివేత

-రాష్ట్ర వ్యాప్తంగా త‌గ్గిన‌ 769.66 హెకార్ల అట‌వీ ప్రాంతం -రాష్ట్రంలో త‌గ్గిన చెట్ల వివ‌రాల‌పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త ఐదేళ్లుగా త‌గ్గిన చెట్ల వివ‌రాలు తెల‌పాలంటూ విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ సోమ‌వారం లోక‌స‌భ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో కేంద్ర ప‌ర్యావరణం, అడవులు వాతావరణ మార్పుల శాఖ‌ మంత్రి భూపేంద్ర యాదవ్ ను ప్ర‌శ్నించ‌టం జ‌రిగింది. అలాగే దేశంలోని అడవుల వెలుపల మొక్కల ప్రణాళిక పై ప‌లు ప్ర‌శ్నలు అడ‌గ‌టం జ‌రిగింది. …

Read More »

సుప్రీం మాజీ చీఫ్ జస్టిస్ రమణతో సీఎం భేటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన అనంతరం సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. శనివారం ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిసిన చంద్రబాబు దాదాపు గంటపాటు కేంద్ర, రాష్ట్ర పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. జస్టీస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులతో కూడా చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటించారు. తన నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును జస్టీస్ ఎన్వీ రమణ ఘన స్వాగతం పలికి సత్కరించారు.

Read More »

సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపి కేశినేని శివనాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు శుక్ర‌వారం ఢిల్లీ విమానాశ్రయంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. సెక్రటేరియట్ నుంచి హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. చంద్రబాబు శనివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ భేటీలో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ప్రధానంగా పోలవరం అంశం,. …

Read More »

మర్యాదపూర్వక కలయిక అమిత్ షాను కలిసిన సుజనా చౌదరి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి బుధవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం రాజధాని అమరావతికి తక్షణమే 15000 వేల కోట్లు విడుదల చేయడం శుభ పరిణామం అని అమిత్ షా కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Read More »

ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ‌ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వ‌ద్ద ఏపీలో జ‌రిగిన విధ్వంసం, హ‌త్యలు, అరాచ‌క‌ల‌ ఫోటో ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాటు చేశారు. అనంత‌రం ఈ ఘ‌ట‌న‌ల‌ను నిర‌సిస్తూ, దీక్ష చేపట్టిన జగన్ మీడియాతో మాట్లాడుతూ…. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని పేర్కొన్నారు. 45 రోజుల్లోనే 30కిపైగా హత్యలు జరిగాయని ఆరోపించారు. దాడుల భయంతో దాదాపు 300మంది వలస వెళ్లిపోయారని తెలిపారు. ప్రైవేటు ఆస్తులను యథేచ్ఛగా …

Read More »

FCV పొగాకు అమ్మకాలకు అనుమతి

-2023-24 పంట సీజన్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని వేలం ప్లాట్‌ఫారమ్‌లలో నమోదిత సాగుదారులచే ఉత్పత్తి చేయబడిన అధిక FCV పొగాకు అమ్మకాలకు అనుమతి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తుపాను వర్షాల కారణంగా నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్‌లోని రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు నిర్ణయం వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, 2023-24 పంట సీజన్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని నమోదిత సాగుదారులు ఆంధ్రప్రదేశ్‌లోని వేలం ప్లాట్‌ఫారమ్‌లలో సాధారణంగా వర్తించే సేవా ఛార్జీలతో ఉత్పత్తి చేసిన అదనపు ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా పొగాకును పొగాకుని …

Read More »

అమృత్ భారత స్టేషన్ పథకం పై ప్ర‌శ్నించిన‌ ఎంపి కేశినేని శివ‌నాథ్

-వివ‌ర‌ణ ఇచ్చిన కేంద్ర‌ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్ ను అప్ గ్రేడ్ చేయ‌టానికి క‌ట్టుబ‌డి వున్నాము. నిత్యం ప్ర‌యాణీకుల‌తో ర‌ద్దీగా వుండే ఈ స్టేష‌న్ కోసం రాబోయే 50 సంవ‌త్స‌రాలను దృష్టిలో పెట్టుకుని మాస్ట‌ర్ ప్లాన్ రూపొందించ‌టం జ‌రిగింది. ప్ర‌యాణీకుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా విజ‌య‌వాడ రైల్వేస్టేష‌న్ అభివృద్ది ప‌నులు, అమ‌రావ‌తి రైల్వే స్టేష‌న్ నిర్మాణం ప‌నులు ఒకేసారి చేసేందుకు ప్రణాళికా రూపకల్పన చేసిన‌ట్లు …

Read More »

2024 బడ్జెట్‌లో ముఖ్యాంశాలు.. ఏ రంగానికి ఎంత కేటాయింపు!

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు.. రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌ మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో పెద్దపీట – రూ.11.11 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం మహిళాభివృద్ధికి రూ.3 లక్షల కోట్లు గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు అర్బన్‌ హౌసింగ్‌ కోసం రూ.2.2 లక్షల కోట్లు వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీతగ్గింపు …

Read More »

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కేంద్ర ప‌థ‌కాలు ఊత‌మిస్తాయి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఏపీకి కేంద్రం ప్రత్యేక సాయం ప్రకటించడం ప‌ట్ల హ‌ర్షం -ప్ర‌ధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి కి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు -కేంద్ర సాయంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ఐదు కోట్ల మంది ప్ర‌జ‌ల ఆకాంక్ష అమ‌రావ‌తి రాజ‌ధాని అభివృద్ది కోసం, కేంద్ర బ‌డ్జెట్ లో ఎపికి ప్ర‌త్యేక సాయం కింద 15 వేల కోట్ల రూపాయ‌లు సాయం ప్ర‌క‌టించ‌టం ప‌ట్ల విజ‌య‌వాడ ఎం.పి కేశినేని శివనాథ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన …

Read More »

పోలవరం ప్రాజెక్టు డిజైన్లకు అనుమతులు ఇప్పించండి…

-సిడబ్ల్యుసి చైర్మన్ ను కలిసి కోరిన మంత్రి రామానాయుడు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు సేఫ్టీకి రాజీ పడకుండా డిజైన్లకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని సి డబ్ల్యూ సి చైర్మన్ కుష్వేందర్ ఓహ్ర ను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఎన్డీఏ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత పోలవరం ప్రాజెక్టుయేనన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి డిజైన్లు లో జాప్యం లేకుండా అనుమతిలిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో మంగళవారం …

Read More »