Breaking News

Tag Archives: machilipatnam

ఉపాధి అవకాశాల కల్పనకు నైపుణ్య గణన… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఉపాధి అవకాశాల కల్పనకు నైపుణ్య గణన ఎంతో ఉపయోగపడుతుందని, ఈ సర్వేకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్ లోని మీకోసం సమావేశపు మందిరంలో మంగళవారం మధ్యాహ్నం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి నిర్వహించిన కార్యశాలలో జిల్లా కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తొలి అయిదు …

Read More »

జిల్లాలో నైపుణ్య గణనకు పటిష్టవంతమైన ఏర్పాట్లు చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నైపుణ్య గణనకు పటిష్టవంతమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు, గ్రామ వార్డు సచివాలయ అధికారులతో శనివారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి, జిల్లాలోని ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో నిర్వహించు నైపుణ్య గణనపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నైపుణ్య గణన తొలుత పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరిలో నిర్వహించారని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారని, అక్కడ నైపుణ్య గణనలో …

Read More »

స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ పై సమీక్ష

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రధానంగా ఆక్వా కల్చర్, పామ్ ఆయిల్, టూరిజం వంటి రంగాల్లో అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం జిల్లా కలెక్టర్లతో అమరావతి సచివాలయం నుండి స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ పై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని డిస్ట్రిక్ట్ విజన్ ప్లాన్ గురించి సీఎస్ గారికి వివరించారు. జిల్లాలో ప్రధానంగా …

Read More »

21 వ అఖిలభారత పశుగణన గోడ పత్రాలు, పుస్తకాలను ఆవిష్కరన

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 25వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పశుసంపద లెక్కింపు ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రకటించారు. గురువారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ విసి హాలులో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 21 వ అఖిలభారత పశుగణన గోడ పత్రాలు, పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 25వ తేదీ నుండి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ వరకు జిల్లాలోని …

Read More »

పంటల బీమా పై అవగాహన చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రబి సీజన్ కు పంటలు వేసిన రైతులందరినీ పంటల బీమా పై అవగాహన కలిగించి అందులో నమోదు చేయించేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం ముఖ్య కార్యదర్శి రాష్ట్ర సచివాలయం నుండి రబి 2024-25 పంటల బీమా నమోదుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ రబి సీజన్లో వంటలు వేసిన …

Read More »

భవనాలకు లేఔట్లకు తప్పనిసరిగా అనుమతులు పొందేలా చర్యలు తీసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ముడా పరిధిలో నిర్మించే భవనాలకు లేఔట్లకు తప్పనిసరిగా అనుమతులు పొందేలా చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేని భవన నిర్మాణాలు, లేఔట్ లపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ముడా అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) టౌన్ ప్లానింగ్ కార్యకలాపాలపై జిల్లా కలెక్టర్ గురువారం కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నం నగరపాలక సంస్థ, పెడన మున్సిపాలిటీ తో పాటు, సి ఆర్ డి ఏ పరిధి మినహా …

Read More »

కోర్టు కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో భూ సమస్యలకు సంబంధించిన కోర్టు కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం సమావేశపు మందిరంలో ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి కోర్టు కేసులకు సమస్యల పరిష్కారం, జాతీయ రహదారుల భూ సేకరణ సమస్యలు, ధాన్యం సేకరణ, రీ సర్వే తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ …

Read More »

రెవిన్యూ వ్యవస్థ పనితీరు పట్ల ప్రజల్లో సానుకూలత కలిగించేలా కృషి చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో సబ్ డివిజన్స్, మ్యుటేషన్స్ వంటి భూసమస్యలపై వస్తున్న అర్జీలను సకాలంలో పరిష్కరించి రెవిన్యూ వ్యవస్థ పనితీరు పట్ల ప్రజల్లో సానుకూలత కలిగించేలా కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ రెవిన్యూ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించి మీకోసం అర్జీలు, నీటి తీరువ పన్ను వసూళ్లు, ఇసుక సరఫరా తదితర రెవిన్యూ అంశాలపై డివిజనులు, మండలాల వారిగా సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం అర్జీలపై కలెక్టర్ …

Read More »

అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకొని సోమవారం స్థానిక పోలీస్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో అమరవీరుల స్తూపం వద్ద మంత్రి జిల్లా ఎస్పీ తో కలిసి పోలీస్ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ లేకపోతే నేటి సమాజంలో పరిస్థితిని …

Read More »

ఎన్నికల ఓటరుగా పేర్లను వచ్చే నవంబరు 6 వ తేదీ లోగా నమోదు చేసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ఓటరుగా పేర్లను వచ్చే నవంబరు 6 వ తేదీ లోగా నమోదు చేసుకోవాలని సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ పిలుపునిచ్చారు. కృష్ణా గుంటూరు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్లో ఓటర్లుగా పేరు నమోదు చేసుకొనుటకు మచిలీపట్నం ఆర్డిఓ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు ప్రత్యేక కేంద్రాన్ని సందర్శించి …

Read More »