Breaking News

Tag Archives: machilipatnam

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధం కావాలి… : జిల్లా ఇంచార్జ్ కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 15న నిర్వహించబోయే జిల్లా స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు. కార్యక్రమానికి సంబంధించి ఆయా శాఖల అధికారులు నిర్వర్తించవలసిన విధులను వారికి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు …

Read More »

మానవ అక్రమ రవాణా పై అప్రమత్తంగా ఉండి గ్రామీణ ప్రజలను కూడా చైతన్యపరచాలని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ విద్యార్థులకు పిలుపునిచ్చారు.

మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : మానవ అక్రమ రవాణా పై అప్రమత్తంగా ఉండి గ్రామీణ ప్రజలను కూడా చైతన్యపరచాలని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం మచిలీపట్నం లోని కృష్ణా విశ్వవిద్యాలయం లో జరిగిన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా ఒక వ్యవస్థీకృత నేరమని, …

Read More »

ప్రకాశం బ్యారేజీ లో వరద నీటి ప్రవాహం రాను రాను పెరుగుతున్న దృష్ట్యా అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ ఆదేశించారు.

మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం బ్యారేజీ లో వరద నీటి ప్రవాహం రాను రాను పెరుగుతున్న దృష్ట్యా అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ నగరంలోని వారి చాంబర్ నుండి క్షేత్రాధికారులతో వరదలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కుల వరద నీటి వివాహం వచ్చే అవకాశం ఉందని, 2 అడుగుల మేరకు అన్ని …

Read More »

వయోవృద్ధుల సంరక్షణ బాధ్యత విస్మరిస్తే చట్టపర చర్యలు  జిల్లా ఇంచార్జ్ కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత పిల్లలదేనని, వారి సంక్షేమాన్ని విస్మరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007పై జిల్లా అధికారులకు నిర్వహించిన ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ కొడుకు …

Read More »

అవకాశాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించి ప్రోత్సహిస్తుందని ఈ అవకాశాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమ కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్. వెంకట్రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం భారత ప్రభుత్వ సంస్థ జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ (ఎన్ ఎస్ ఐ సి)లిమిటెడ్, ఏపీ వాణిజ్యం పరిశ్రమల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ఆ ర్కే ప్యారడైజ్ లో సూక్ష్మ చిన్న మధ్యతరహా వ్యాపారవేత్తల బృందం వ్యాపార సహకారం మార్కెటింగ్ పై …

Read More »

మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదలకు చర్యలు… : జిల్లా ఇంచార్జి కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం అమలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ అధ్యక్షతన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎం ఎం ఎస్ వై) పథక జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో మత్స్య, వ్యవసాయ, నీటిపారుదల, డి ఆర్ డి ఏ, గిరిజన, ఎస్సీ కార్పొరేషన్ తదితర …

Read More »

గుండేరు డ్రైన్ వలన పంట పొలాలు మునిగిపోకుండా వెంటనే తగిన చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆదుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, గుండేరు డ్రైన్ వలన పంట పొలాలు మునిగిపోకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం మంత్రివర్యులు మచిలీపట్నం మండలంలోని చిన్నాపురం గ్రామంలోని గుండేరు డ్రైన్ లో జెసిబి తో గుర్రపు డెక్క తొలగించే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నాపురం గ్రామ రైతులు మంత్రి వద్దకు …

Read More »

వ్యవసాయ అనుబంధ రంగాలలో 8.8 శాతం వార్షిక వృద్ధి రేటు సాదించడంలో ఆంధ్రప్రదేశ్ ది ప్రధమ స్థానం –– రాష్ట్ర గవర్నర్

-ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్టులో ఘనంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 57వ స్నాతకోత్సవ కార్యక్రమం -విద్యార్ధులకు డిగ్రీలు, అవార్డులు అందించిన రాష్ట్ర గవర్నరు, విశ్వవిద్యాలయ కులపతి ఎస్ అబ్దుల్ నజీర్.. ఆత్కూరు(ఉంగుటూరు), నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ 2024-25వ సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాలలో 8.8 శాతం వార్షిక వృద్ధి రేటు సాదించడంలో ప్రధమ స్థానంలో వుందని రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ భారత్ …

Read More »

గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు ఘనంగా స్వాగతం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం ఉదయం ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 57వ నాతకోత్సవంలో పాల్గొనేందుకు గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ కు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు ఘనంగా స్వాగతం లభించింది. తొలుత గవర్నర్ ట్రస్ట్ కు చేరుకోగానే పోలీసు గౌరవ వందనం స్వీకరించాక జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, కైకలూరు …

Read More »

ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ కార్యక్రమం ఏర్పాట్లు పూర్తి

ఆత్కూరు(ఉంగుటూరు), నేటి పత్రిక ప్రజావార్త : ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్టులో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ కార్యక్రమమునకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు గురువారం రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉంగుటూరు మండలం, ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ భారత్ ట్రస్టులో జరగనున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 57వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని …

Read More »