Breaking News

Tag Archives: machilipatnam

వివిధ రాయితీలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మరియు వారికి వివిధ రాయితీలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఇంతవరకు ఉద్యం రిజిస్ట్రేషన్ తీసుకొని సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు ఉద్యం రిజిస్ట్రేషన్ పోర్టల్ నందు నమోదు చేయడం కోసం జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో కానూరు న్యూ ఆటోనగర్ క్లస్టర్ భవనం నందు ఉద్యం రిజిస్ట్రేషన్ క్క్యాంప్ ఈ గురువారం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమలు కేంద్రం జనరల్ …

Read More »

మచిలీపట్నంకు చేరుకున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) సైకిల్ ర్యాలీ

-టీమ్ కు ఘన స్వాగతం పలికిన అడిషనల్ ఎస్పీ సి.సత్యనారాయణ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలు గల భద్రతను అందిస్తున్న పారామిలటరీ దళం అయినటువంటి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) సైకిల్ ర్యాలీ గురువారం సాయంత్రం జిల్లా కేంద్రం మచిలీపట్నం కు చేరుకుంది. సైకిల్ ర్యాలీ టీమ్ కు జిల్లా అడిషనల్ ఎస్పీ సి.సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బ్యాండ్ మేళంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ వెలుపల …

Read More »

సవాళ్లు ఎదురైతే సకాలంలో పరిష్కరించి అమలు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలలో జరిగే సంక్షేమ, అభివృద్ధి పనుల అమలు పర్యవేక్షణకు, పరిపాలన పటిష్టపరుచుటకు, ఏమైనా సవాళ్లు ఎదురైతే సకాలంలో పరిష్కరించి అమలు చేయుటకు, అంతర శాఖల సమావేశం సమన్వయం కోసం సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లా ఇన్చార్జ్ అధికారులుగా ఇటీవల నియమించింది. ఇందులో భాగంగా జిల్లా ఇన్చార్జి అధికారిగా నియమించబడిన డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ గురువారం నగరంలోని కలెక్టరేట్కు రాగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కే …

Read More »

కర్మయోగి భారత్ ఆన్లైన్ శిక్షణ పూర్తి చేసుకుని ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా పొందాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఉద్యోగులందరూ ఈనెల 26వ తేదీలోగా కర్మయోగి భారత్ ఆన్లైన్ శిక్షణ పూర్తి చేసుకుని ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా పొందాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అధికారులతో ఐ గాట్ కర్మయోగి భారత్ శిక్షణ కార్యక్రమంపై వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సి ఎఫ్ ఎం ఎస్ …

Read More »

ప్రాధాన్యత అంశాలపై నివేదికలు అందించాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 25, 26 తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలు కలిగిన నివేదికను తక్షణమే సమర్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా …

Read More »

రాష్ట్రంలో వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు వేగవంతంగా పని పనిచేస్తోంది…

మల్లవల్లి (హనుమాన్ జంక్షన్), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్యపరంగా వేగవంతంగా పని పనిచేస్తోందని (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ద్వారక తిరుమలరావు, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు …

Read More »

మంగినపూడి బీచ్ ఉత్సవాలను త్వరలో ఘనంగా నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మంగినపూడి బీచ్ ఉత్సవాలను త్వరలో ఘనంగా నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో మంగినపూడి బీచ్ ఉత్సవాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గతంలో మంగినపూడి బీచ్ ఉత్సవాలను ఎలా నిర్వహించారో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరెన్స్ తర్వాత రాష్ట్ర గనులు …

Read More »

పరిశ్రమల ఏర్పాటుకు తక్షణ అనుమతులు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందుకు సంబంధించిన అనుమతులను సింగిల్ విండో పద్ధతిలో తక్షణమే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. సమావేశంలో అజెండా అంశాలు, పెండింగ్ దరఖాస్తుల పురోగతి, సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ …

Read More »

ఓటర్ల జాబితా తయారీతో పాటు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సహకారం అందించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీతో పాటు అవసరమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. మంగళవారం ఉదయం నగరంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వారి చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే కాకుండా అంతకు ముందుగా కూడా ఓటర్ల జాబితా స్వచ్చీకరణ, …

Read More »

చిట్టిపాలెం గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించిన జిల్లా కలెక్టర్

చిట్టిపాలెం (మచిలీపట్నం), నేటి పత్రిక ప్రజావార్త : వేరువేరుగా తడి పొడి చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రతిరోజూ ఒక సమయాన్ని వీలుచేసుకుని జిల్లాలోని వివిధ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి చెత్త సేకరణ పరిశీలించి ప్రజలకు స్వయంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ సోమవారం ఉదయం మచిలీపట్నం మండలం, అరిశేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చిట్టిపాలెం గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించే విధానాన్ని పరిశీలించారు. గ్రామంలో ఆయన దాదాపుగా …

Read More »