-టీమ్ కు ఘన స్వాగతం పలికిన అడిషనల్ ఎస్పీ సి.సత్యనారాయణ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలు గల భద్రతను అందిస్తున్న పారామిలటరీ దళం అయినటువంటి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) సైకిల్ ర్యాలీ గురువారం సాయంత్రం జిల్లా కేంద్రం మచిలీపట్నం కు చేరుకుంది. సైకిల్ ర్యాలీ టీమ్ కు జిల్లా అడిషనల్ ఎస్పీ సి.సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బ్యాండ్ మేళంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ వెలుపల అభినందన సభ ఏర్పాటు చేసి టీమ్ ను ప్రత్యేకంగా అభినందించారు.
సైకిల్ ర్యాలీ నేపథ్యం:
భారత దేశంలో ప్రభుత్వ ప్రైవేట్ పారిశ్రామిక భద్రతా దృష్ట్యా 1969 మార్చ్ 10న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్)ను కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేసింది.
1969 నుండి సుమారు 2 లక్షల పైగా సిఐఎస్ఎఫ్ సిబ్బంది, దేశం నలుమూలలా అంతర్గత పరిరక్షణలో ప్రముఖపాత్ర వహిస్తూ, దేశం మొత్తంలో 25 రాష్ట్రాలలో, 358 పైగా యూనిట్లలో అనునిత్యం కోట్ల మంది ప్రజల సురక్షిత ప్రయాణాలకు, లక్షల కోట్ల ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను కాపాడుతూ, దేశ శాంతిభద్రతలలో ముఖ్యపాత్ర వహిస్తూ 10.03.2025 నాటికి సిఐఎస్ఎఫ్ గౌరవప్రదంగా తన 55 సుదీర్ఘ వసంతాలు పూర్తి చేసుకుని, 56వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా “సురక్షిత తీరం సమృద్ధి భారత్ ” పేరుతో దేశంలో 6వేల కిలోమీటర్లకు పైగా సముద్రపు తీరప్రాంత ప్రజలలో, దేశ భద్రత సమైక్యతను పెంపొందిస్తూ, దేశ, రాష్ట్ర, జిల్లా ప్రజల్ని, కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బందితో మమేకం చేస్తూ సిఐఎస్ఎఫ్ టీమ్ సైకిల్ ర్యాలీను నిర్వహించాలని భావించి ఈ నెల 7న పశ్చిమ బెంగాల్లోని బఖ్ఖలి నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు సముద్రతీర ప్రాంతం గుండా 60 మంది సభ్యులతో సైకిల్ ర్యాలీను ప్రారంభించడం జరిగింది.
భారత దేశంలో అత్యున్నత ప్రమాణాలు గల భద్రతను అందిస్తున్న పారామిలటరీ దళం అయినటువంటి సిఐఎస్ఎఫ్ ఈ మహోన్నత ఆశయం గల సైకిల్ ర్యాలీను నిర్వహించడం, తద్వారా భారతీయ యువతను దేశ భద్రతలో భాగం చేయడంతో పాటు దేశ ఆర్ధిక అభివృద్ధి రక్షణలో మన సైనికుల నిబద్ధత, అకుంఠిత దీక్షను పెంపొందించడం.
మార్చి 15 నుండి మార్చ్ 24, 2025 వరకు సోంపేట, శ్రీకాకుళం, విశాఖపట్నం, అన్నవరం, అమలాపురం, మచిలీపట్నం, చీరాల, ఒంగోలు, కావలి, నాయుడుపేట మీదుగా కన్యాకుమారి వైపు సిఐఎస్ఎఫ్ టీం సైకిల్ ర్యాలీ కొనసాగుతుంది.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమాండెంట్లు హ్రిషబ్, ప్రభాకర్, అసిస్టెంట్ కమాండెంట్లు జి శ్రీనివాస్, శిఖర్ లోహియా, ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News