మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు హక్కు పొందడం, ఓటు వేయడం మనందరి బాధ్యత కావాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని శనివారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జిల్లాస్థాయి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మన దేశానికి స్వాతంత్రం రాకముందు అందరికీ ఓటు హక్కు లేదని, అయితే స్వాతంత్రానంతరం 1950లో భారత ఎన్నికల సంఘం ఏర్పడిందని, అందరికీ ఓటు హక్కు కల్పించడంతోపాటు …
Read More »Tag Archives: machilipatnam
739.11 క్వింటాళ్ల బియ్యాన్ని బహిరంగ వేలం…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా పంపిణీ వ్యవస్థలో 6ఏ కేసులలో స్వాధీనం చేసుకున్న 739.11 క్వింటాళ్ల బియ్యాన్ని బహిరంగ వేలం వేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. నిత్యావసర వస్తువుల చట్టం, 1955 క్రింద 6-A కేసులలో 739.11 క్వింటాళ్ళ ప్రజా పంపిణీ బియ్యానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణ సమక్షంలో వారి ఛాంబర్, మచిలీపట్నం వద్ద ఈ నెల 31 వ తేదీ ఉదయం 10.30.గంటలకు బహిరంగ వేలం వేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ …
Read More »సాయుధ దళాల పతాక నిధి సేకరణలో జిల్లా మూడవ స్థానం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సాయుధ దళాల పతాక నిధి సేకరణలో కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచిందని జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి సర్జన్ లెఫ్ట్నెంట్ కల్నల్ డాక్టర్ కే. కళ్యాణ వీణ శుక్రవారం తెలిపారు. ఇందుకు సంబంధించి డిసెంబర్లో రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా మెమెంటో తీసుకోవలసి ఉండగా, అనివార్య కారణాలవల్ల ఆ కార్యక్రమం రద్దు కావడంతో, ఆ మెమెంటోను శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాకలెక్టర్ డీకే బాలాజీ ని కలిసి జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి అందజేశారు. ఈ …
Read More »మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) సమావేశం ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ అధ్యక్షతన, కో- చైర్మన్ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ లతో కలెక్టరేట్లో శుక్రవారం జరిగింది. ముడా పరిధిలో లేఅవుట్లకు ముడా నుండి నిబంధనల మేరకు తగిన అనుమతులు తప్పనిసరిగా పొందాలని, ముడా పరిధిలోని గ్రామాల్లో భవన నిర్మాణాలకు ఆన్లైన్ ద్వారా ముడా అనుమతులు పొందాలని, ముడా పరిపాలన భవనాన్ని నిర్మించేందుకు అవసరమైన స్థలం కేటాయించాలని సమావేశంలో తీర్మానించారు. …
Read More »కోడూరు మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్
కోడూరు, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోడూరు మండలంలో పర్యటించి మండలంలోని ఉల్లిపాలెంలో అంగన్వాడీ కేంద్రం, మండలపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా జిల్లా కలెక్టర్ ఉల్లిపాలెంలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల హాజరు, బరువును నమోదు చేసే రిజిస్టర్లు, అదేవిధంగా పిల్లలకు పెడుతున్న మెనూపై ఆరా తీసి నాణ్యతను పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన బరువు తూచే యంత్రంపై పిల్లలను స్వయంగా ఉంచి బరువును రిజిస్టరులో నమోదు …
Read More »శానిటేషన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో శానిటేషన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ డి కే బాలాజీ అధికారులను, శానిటేషన్ సిబ్బందిని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉదయం స్థానిక 45, 46 డివిజన్లలో పర్యటించి ఇంటింటి చెత్త సేకరణ ఎలా జరుగుతున్నది? పరిశీలించారు. చెత్త సేకరించే సమయంలో తడి /పొడి చెత్త వేరు చేయించి సేకరించాలని సిబ్బందికి సూచించారు. ఇంటింటి చెత్త సేకరణ జరుగుతున్నప్పటికీ రోడ్ల వెంబడి చెత్త ఎవరు వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారని, శానిటేషన్ సిబ్బంది …
Read More »పీఎం సూర్య ఘర్ మంచి పథకం
-జిల్లాలో విరివిగా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పీఎం సూర్య ఘర్ ఎంతో మంచి పథకమని జిల్లాలోని ప్రజలు విరివిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లో పీఎం సూర్యఘర్ ఇప్పటికే వినియోగించుకుని లబ్ధి పొందుతున్న లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడి ఈ పథకం వల్ల వారు పొందిన ప్రయోజనాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పథకం లబ్ధిదారులు స్థానిక చింతగుంటపాలెం కు చెందిన చోడవరపు ప్రసూన, స్థానిక అరవ గూడెంకు …
Read More »వేసవిలోనే పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఖరీఫ్ సీజన్ కు జిల్లాలో కాలువల డ్రైన్ల నిర్వహణ పనులు ముందుగా చేపట్టుటకు అవసరమైన అంచనాలు రూపొందించి వేసవిలోనే పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లో ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్ సీజన్లో రైతులు పంటల సాగుకు ప్రయోజనకరంగా ప్రతి ఏడాది జూన్ మాసంలో కాలువలకు సాగునీటి విడుదల చేయడం …
Read More »గ్యాస్ పంపిణీదారులు, డెలివరీ బాయ్స్ అదనపు చార్జీ వసూలు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తాం……
వినియోగదారుల నుంచి రసీదులో ముద్రించిన సొమ్మును మాత్రమే వసూలు చేయాలి….. క్షేత్రస్థాయి తనిఖీలతో నిరంతర పర్యవేక్షణ…… అదనపు సొమ్ము వసూలు చేస్తే టోల్ ఫ్రీ 1967 కు ఫిర్యాదు చేయొచ్చు…. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ. మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దీపం 2 పథకం అమలులో భాగంగా వినియోగదారులకు డెలివరీ బాయ్స్ ఎల్పీజీ సిలిండర్లు డెలివరీ చేసే సమయంలో అదనపు సొమ్ము వసూలు చేస్తున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, అట్లు వసూలు చేసిన పక్షంలో సంబంధిత గ్యాస్ డెలివరీ బాయ్స్ మరియు …
Read More »తడి పొడి చెత్త నిర్వహణ సక్రమంగా అమలు చేయాలి జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో తడి పొడి చెత్త నిర్వహణ సక్రమంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ మంగళవారం సాయంత్రం నగర కమిషనర్, పారిశుద్ధ్య నిర్వహణ నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించి తరలించాలన్నారు. రహదారుల ప్రక్కన …
Read More »
Prajavartha Online Telugu News