Breaking News

మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) సమావేశం ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ అధ్యక్షతన, కో- చైర్మన్ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ లతో కలెక్టరేట్లో శుక్రవారం జరిగింది. ముడా పరిధిలో లేఅవుట్లకు ముడా నుండి నిబంధనల మేరకు తగిన అనుమతులు తప్పనిసరిగా పొందాలని, ముడా పరిధిలోని గ్రామాల్లో భవన నిర్మాణాలకు ఆన్లైన్ ద్వారా ముడా అనుమతులు పొందాలని, ముడా పరిపాలన భవనాన్ని నిర్మించేందుకు అవసరమైన స్థలం కేటాయించాలని సమావేశంలో తీర్మానించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ జాయింట్ సెక్రటరీ జె శివయ్య, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ రాజమండ్రి బి శ్రీనివాసమూర్తి, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ఆర్ వెంకట్రావు,ముడా డిప్యూటీ కలెక్టర్ రవిశంకర్, ఆర్ అండ్ బి డిఈ సంగీత, ఏపీ సిపిడిసిఎల్ ఆపరేషన్స్ జి. గోవిందరావు, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, డిపిఓ కార్యాలయ ఏవో వి. సీతారామయ్య పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *