Breaking News

Tag Archives: machilipatnam

నా చివరి రక్తపు బొట్టు వరకు బందరు కోసం శ్రమిస్తా

-ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం బీచ్, నేటి పత్రిక ప్రజావార్త : మసులా బీచ్ ఫెస్ట్-2025లో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నంలో ఇలాంటి జన సునామీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.. దేశంలో ఏ బీచ్ లో కూడా ఇలాంటి ఫెస్ట్ జరగలేదన్నారు. ఇలాంటి కార్యక్రమం విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలన్నారు. బందరు పర్యాటక అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పడమే నా లక్ష్యం అన్నారు.. రేపల్లె మచిలీపట్నం రైల్వే మార్గం పూర్తి చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి మరింత వేగవంతం …

Read More »

13వ జాతీయ బీచ్ కబడ్డీ పోటీల విజేతలు

-బీచ్ కబడ్డీ పురుషుల విభాగంలో ఛాంపియన్ ఆంధ్రప్రదేశ్ -బీచ్ కబడ్డీ మహిళల విభాగంలో విజేత హర్యానా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మసూల ఫెస్ట్ – 2025 పురష్కరించుకుని మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో నిర్వహిస్తున్న 13వ జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్ గా నిలిచింది. ద్వితీయ స్థానంలో రాజస్థాన్ నిలవగా, తృతీయ స్థానంలో ఉత్తరాఖండ్, హర్యానాలు నిలిచాయి. మహిళల విభాగంలో ఛాంఫియన్ గా హర్యానా జట్టు నిలవగా, ద్వితీయ స్థానంను హిమాచల్ ప్రదేశ్, …

Read More »

బీచ్ వాలీబాల్ పోటీల విజేతలు

-పురుషుల విభాగంలో ఫైనల్స్ విజేత జట్టు విజయనగరం -మహిళల విభాగంలో ఫైనల్స్ విజేత జట్టు గుంటూరు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మసూల ఫెస్ట్ – 2025 పురష్కరించుకుని మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో నిర్వహిస్తున్న ఆహ్వాన బీచ్ వాలీబాల్ పోటీల్లో పురుషుల విభాగంలంలో మొదటి స్థానంలో విజయనగరం జట్టు నిలవగా, ద్వితీయ స్థానంలో కృష్ణా జిల్లా జట్టు, తృతీయ స్థానంలో వైజాగ్ నిలవగా నాల్గోవ స్థానంను శ్రీకాకుళం కైవసం చేసుకుంది. అలాగే మహిళల విభాగంలో మొదటి స్థానం ను గుంటూరు జట్టు …

Read More »

వైభ‌వోపేతంగా మసులా బీచ్ ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమాలు

-చివ‌రి రోజున కూడా ప‌ర్యాట‌కుల శోభ‌తో బీచ్ ప‌రిస‌రాలు -జ‌న సంద్రంగా మారిన మంగిన‌పూడి బీచ్‌ -మసులా బీచ్ ముగింపుకు ల‌క్ష‌లాది మంది రాక‌ -ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా మసులా బీచ్ ఫెస్టివ‌ల్ వేడుక‌లు -నాలుగు రోజులపాటు ప‌ర్యాట‌కులు దాదాపు 15 ల‌క్ష‌ల మంది పైగా రాక‌ మచిలీపట్నం బీచ్, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం సాయంత్రం ప్ర‌జ‌ల హ‌ర్ష‌ద్వానాల మ‌ధ్య మంగినపూడి బీచ్ ఒడ్డున మసులా బీచ్ ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమాలు అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభమయ్యాయి. గాయ‌నీ గాయ‌క‌లు పాడిన పాటలు …

Read More »

మచిలీపట్నం బీచ్ కు జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి కృషి చేస్తా..

-వాటర్ స్పోర్ట్స్, బీచ్ వాలీబాల్, బీచ్ ఫుట్బాల్, పారా గ్లైడింగ్, హేలీ రేడింగ్ తో పాటు సందర్శకులకు కనువిందు చేయడానికి సాంస్కృతిక కార్యక్రమాలు, దేశంలో విభిన్న ఆహార పదార్థాలు ఒకేచోట లభ్యం అయ్యేలా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది.. -మసూల ఫెస్ట్ విజయవంతం చేయటంలో కృషి చేసిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, సందర్శకులకు ధన్యవాదాలు.. -పారా గ్లైడింగ్ ఎక్కినప్పుడు బీచ్ అందాలు మరింత శోభాయమానంగా కనిపించాయి.. -బీచ్ లో రక్షణ చర్యలు తీసుకోవడంలో అధికారులు చూపిస్తున్న శ్రద్ధ అభినందనీయం.. -ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కడ తలెత్తకుండా …

Read More »

జనసంద్రమైన మంగినపూడి సముద్ర తీరం..

-మసులా బీచ్ ఫెస్టివల్ 3వ రోజూ రెట్టించిన ఉత్సాహంతో పర్యాటకుల సందడి.. -వివిధ రకాల ఫుడ్ స్టాల్స్, అమ్యూజ్మెంట్ రైడ్స్, సాంప్రదాయ హస్తకళల స్టాళ్లను పర్యాటకులు సందర్శించడంతో పెరిగిన రద్దీ.. -అధిక సంఖ్యలో బిర్యానీ, ఐస్ క్రీమ్ స్టాళ్లు.. మంగినపూడి బీచ్, నేటి పత్రిక ప్రజావార్త : మసులా బీచ్ ఫెస్టివల్ కు గత రెండు రోజులుగా తరలి వస్తున్న అశేష పర్యాటకులతో మంగినపూడి బీచ్ సముద్ర తీరంలో మూడవ రోజూ శనివారం కోలాహాలం కొనసాగింది. వచ్చిన పర్యాటకులతో మంగినపూడి సముద్ర తీరం జనసంద్రాన్ని …

Read More »

3వ రోజుకు జాతీయ సీ కయాకింగ్ & స్టాండ్ అప్ ఫెడ్లింగ్ చాంపియన్షిప్ -2025

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ సీ కయాకింగ్ & స్టాండ్ అప్ ఫెడ్లింగ్ చాంపియన్షిప్ -2025 పోటీలు 3వ రోజుకు చేరుకున్నాయి కయాకింగ్ 500మీటర్ల అండర్ 14 బాలుర విభాగంలో మొదటి స్థానంలో సౌరవ్ సాహు, ద్వితీయ స్థానంలో రియాస్ ఖాన్, తృతీయ స్థానంలో మహమ్మద్ ఇర్ఫాన్ లు నిలిచారు. కయాకింగ్ 500మీటర్ల అండర్ 14 బాలికల విభాగంలో మన రాష్ట్రానికి చెందిన చరిత శ్రీ మొదటి స్థానంలో నిలిచింది, మహారాష్ట్ర కు  చెందిన సాయి స్కిర్సాజు ద్వితీయ స్థానంలో నిలవగా, …

Read More »

బందరులో పుట్టడం మనందరి అధృష్టం

-బందరు పోర్టును 2026 జూన్, జులైలో ప్రారంభిస్తాం -కొల్లు రవీంద్ర, మంత్రి, రాష్ట్ర గనులు, భూ గర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ నవాబుల కాలం నుంచి కొన్ని శతాబ్దాలుగా వెలుగొంది నటువంటి గడ్డ ఈ బందరు గడ్డ, ఇక్కడ పుట్టడం మనందరి అదృష్టం అని అందుకు ఒకసారి గట్టిగా భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేద్దామని రాష్ట్ర గనులు, భూ గర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం మసులా బీచ్ లో ఏర్పాటు …

Read More »

మసులా బీచ్ ఫెస్టివల్లో హెలీ రైడ్స్ ప్రారంభం

-హేలీ రైడ్ తో బీచ్ పరిసరాలను పరిశీలించిన మంత్రి -కొల్లు రవీంద్ర, మంత్రి రాష్ట్ర గనులు, భూ గర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ లో జరుగుతున్న మసులా బీచ్ ఫెస్టివల్-2025 లో భాగంగా హెలీ రైడ్స్ ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో కలసి ప్రారంభించారు. అనంతరం హెలికాప్టర్ లో బీచ్ పరిసర ప్రాంతాలతోపాటు మసులా బీచ్ కి వచ్చే పర్యాటకులకు …

Read More »

3వ జాతీయ సీ కయాకింగ్ మరియు స్టాండప్ పెడలింగ్ ఛాంపియన్షిప్ -2025 పోటీలు

-ఆహ్లాదకర వాతావరణంలో, అశేష ప్రేక్షకుల ఆధరణ మధ్య వేడుకగా ప్రారంభం అయిన 3వ జాతీయ సీ కయాకింగ్ మరియు స్టాండప్ పెడలింగ్ ఛాంపియన్షిప్ -2025 పోటీలు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ కయాకింగ్ పోటీలను జెండా ఊపి ప్రారంభించిన గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మొట్టమొదటి సరిగా మన రాష్ట్రం లో కయాకింగ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. విదేశాలను తలపించేలా వాటర్ స్పోర్ట్స్ కేంద్రంగా మసులా …

Read More »