మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామికవేత్తలకు కృష్ణాజిల్లా అనుకూలమైన ప్రాంతమని, పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పియంఈపిజిపి), పీఎం విశ్వకర్మ యోజన పథకం తదితర అంశాలపై ఆయన సంబంధిత …
Read More »Tag Archives: machilipatnam
రహదారి ప్రమాదాలు నివారించడానికి అన్ని భద్రత చర్యలు పకడ్బందీగా చేపట్టాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రహదారి ప్రమాదాలు నివారించడానికి అన్ని భద్రత చర్యలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చ్చాంబర్లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించి ప్రమాదాలు, నివారణ తదితర అంశాలపై సమీక్షించారు. తొలుత జిల్లా రవాణా అధికారి జి మనీషా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత మూడు సంవత్సరాల్లో జరిగిన రహదారి ప్రమాదాలను కలెక్టర్ కు వివరించారు. ఈ సంవత్సరం 569 …
Read More »పోతేపల్లిలో ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే విద్య, ఎంటర్ ప్రెన్యూర్స్ చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) జిల్లా పరిశ్రమల శాఖ సహకారంతో ఎం ఎస్ ఎం ఈ క్లస్టర్ ఔట్రీచ్ ప్రోగ్రాం శుక్రవారం బందరు మండలం పోతేపల్లిలో ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్ లో నిర్వహించారు. ఇమిటేషన్ జ్యువెలరీ క్లస్టర్ ఎంటర్ప్రైన్యూర్స్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎంటర్ప్రెన్యూర్స్ తలుచుకుంటే …
Read More »లో వోల్టేజ్ సమస్య లేకుండా తగిన చర్యలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నియోజకవర్గంలో లో వోల్టేజ్ సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి మంత్రివర్యులు నగరంలోని వారి నివాసంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ నియోజకవర్గ మచిలీపట్నం నియోజకవర్గంలో లో వోల్టేజ్ సమస్య లేకుండా కొత్త సబ్ స్టేషన్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. విద్యుత్ తీగలు కిందకు …
Read More »అనాధ పిల్లలకు ఆధార్ కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలి… : జిల్లా కలెక్టర్
కానూరు, నేటి పత్రిక ప్రజావార్త : తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలను గుర్తించి వారికి ఆధార కార్డులు, ఆర్ఫన్(అనాధ) సర్టిఫికెట్ల జారీకి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం ఆయన పెనమలూరు మండలం కానూరులోని జిల్లా మహిళాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో పిల్లల సంరక్షణ సంస్థలు, బాల్యవివాహాలు, పిల్లల లైంగిక వేధింపులు, బాల కార్మికులు, పిల్లల సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల సంరక్షణ సంస్థల్లో …
Read More »తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి… : జిల్లా కలెక్టర్
తాడిగడప (పెనమలూరు), నేటి పత్రిక ప్రజావార్త : అధికారులందరూ సమిష్టిగా పనిచేస్తూ తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. గురువారం ఉదయం పెనమలూరు మండలం, తాడిగడపలోని బందరు రోడ్డు ప్రధాన రహదారి పక్కన ఉన్న ద్వారక హోటల్ ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ పెనమలూరు నియోజకవర్గ శాసన సభ్యులు బోడే ప్రసాద్ తో కలసి తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యులు తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన సమస్యలను …
Read More »కేడీసీసీ బ్యాంకుకు ఎంతో ఘన చరిత్ర, మంచి పేరు ఉంది…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేడీసీసీ బ్యాంకుకు ఎంతో ఘన చరిత్ర, మంచి పేరు ఉందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం కృష్ణా జిల్లాలోని మండల కేంద్రమైన మోపిదేవిలో 1.10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన భవనాన్ని మంత్రివర్యులు అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం మేనేజరు, స్ట్రాంగ్, …
Read More »యువతకు ఉపాధి కల్పన లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు…
గుడ్లవల్లేరు(కౌతవరం), నేటి పత్రిక ప్రజావార్త : యువతకు ఉపాధి కల్పన లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు సాధించి, పరిశ్రమలు ఏర్పాటు చేసి వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. రెవిన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్, రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ లతో కలసి రెవెన్యూ మంత్రి గురువారం కౌతవరంలో …
Read More »శివారు ప్రాంతాలకు తాగునీరు అందించాలి
-నిర్ణీత సమయంలోగా గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి -అధికారిక కార్యక్రమాలకు ప్రోటోకాల్ పాటించండి -జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని శివారు గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీరు సక్రమంగా అందించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, వైస్ చైర్ పర్సన్ గరికిపాటి శ్రీదేవి అధ్యక్షతన స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో స్థాయి సంఘ సమావేశాలు …
Read More »అర్బన్ బ్యాంకు సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అర్బన్ బ్యాంకు సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం ఉదయం నగరంలోని జిల్లా పరిషత్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన గుంటూరు అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు లాకర్లు డిపాజిట్లు రుణాల విభాగాలను క్యాష్ కౌంటర్లను పరిశీలించారు. అనంతరం వినియోగదారులకు తనదైన శైలిలో మెరుగైన సేవలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మంత్రి బ్యాంక్ అధికారులకు …
Read More »